Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అదుపు తప్పి లోయలో పడ్డ ఇసుక టిప్పరు

    Author VENKATESH | 07 Jul 2026, 04:48 PM | నారాయణపేట
    అదుపు తప్పి లోయలో పడ్డ ఇసుక టిప్పరు

    - డ్రైవర్ అక్కడికక్కడే మృతి
    - షేర్నపల్లిలో విషాదఛాయలు
    నారాయణపేట, జూలై 7 (బి వి కే న్యూస్ )
    మక్తల్ మండల పరిధిలోని మాదనపల్లి గ్రామ సమీపంలో మంగళవారం ఇసుక టిప్పర్ అదుపుతప్పి లోయలో పడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.
    సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట మండలం సీర్నపల్లి గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ నరేష్ తన వాహనపు ఇసుకలోడుతో నర్వ మండల కేంద్రం వైపు నుండి జక్లేర్ గ్రామం వైపు విచ్చేస్తున్న ఇసుక టిప్పర్ మదనపల్లి సమీపంలో వస్తున్న సందర్భంలో అదుపుతప్పి లోయలో పడడంతో టిప్పర్ డ్రైవరు నరేష్ అట్టి తన టిపరెక్కిందని పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నరేష్ కుటుంబంలో తన ఒక్కడే కుమారుడు కావడంతో షేర్నపల్లిలో అట్టి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయాన్ని తెలుసుకున్న మక్తల్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితి పరిశీలించి మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మస్తు నిమిత్తం తరలించారు. ఈ సందర్భంగా మక్తల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పరిశీలిస్తున్నారు.