Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కేతపల్లి ప్రభుత్వ పాఠశాలలో రీఓపెనింగ్ నిర్వహించిన ఎంఈఓ

    Author VENKATESH | 07 Jul 2026, 05:27 PM | నల్గొండ
    కేతపల్లి ప్రభుత్వ పాఠశాలలో రీఓపెనింగ్ నిర్వహించిన ఎంఈఓ

    దేవరకొండ 07జూలై (BVK 3 న్యూస్ ) : రాష్ట్ర ప్రభుత్వ హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియలో భాగంగా విలీనమైన ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరానికి సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. నేరడుగొమ్ము మండలంలో గతంలో కొనసాగిన 18 ప్రభుత్వ పాఠశాలలు విలీనమవగా,ప్రస్తుతం కేతపల్లి,ధర్మరేఖ తండా, వైజాగ్ కాలనీ,బచ్చాపురం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే విద్యాబోధన కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో కేతపల్లి ప్రభుత్వ పాఠశాలలో రీఓపెనింగ్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) బ్రహ్మచారి పాఠశాలను పునఃప్రారంభించి విద్యార్థులకు పూలు అందజేస్తూ ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం తరగతి గదులు, తాగునీటి సౌకర్యం,మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, పరిశుభ్రత,పాఠ్యపుస్తకాల పంపిణీ తదితర అంశాలను పరిశీలించి ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ బ్రహ్మచారి మాట్లాడుతూ,ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు,యూనిఫాంలు,మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను విద్యార్థులు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మొదటి రోజు నుంచే క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించి వారి విద్యాభివృద్ధికి సహకరించాలని కోరారు.
    ఈ కార్యక్రమంలో కేతపల్లి ఎంఈఓ బ్రహ్మచారి, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీను, గ్రామ సర్పంచ్ పద్మ–భీమ్‌సింగ్, ఉపసర్పంచ్ కొత్తపెల్లి జంగమ్మ రాములు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
    మండలంలో పాఠశాలల విలీనం అనంతరం ప్రారంభమైన తొలి విద్యా కార్యక్రమానికి కేతపల్లి ప్రభుత్వ పాఠశాల వేదిక కావడం విశేషం.మిగిలిన మూడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యాబోధన కొనసాగుతోంది.