Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పెన్షనర్స్ అనుమతి లేకుండా1.5% వేతనంలో డబ్బులు ఎలా కట్ చేస్తారు

    Author VENKATESH | 07 Jul 2026, 09:18 PM | నారాయణపేట
    పెన్షనర్స్  అనుమతి లేకుండా1.5% వేతనంలో డబ్బులు ఎలా కట్ చేస్తారు

    - రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మక్తల్ పెన్షనర్ సంఘం అధ్యక్షడు బి.గోపాలం
    నారాయణపేట, జూలై 7 (బి వి కే న్యూస్)
    తెలంగాణ రాష్ట్ర పెన్షనర్స్ కు హెల్త్ కార్డులు జారీ చేయకుండానే, విధివిధానాలను రూపొందించకుండానే మే నెల, జూన్ నెల జీతం లో ఒకటి పాయింట్ ఐదు(1.5%) శాతం డబ్బులు ఎలా కట్ చేస్తారంటూ మక్తల్ పెన్షన్ సంఘం అధ్యక్షుడు బి.గోపాలం మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా మండిపడ్డారు.
    పెన్షనర్స్ అనుమతి లేకుండా1.5% మినాయించడం పెన్షనర్స్ అందరూ ఆందోళనకు గురి అవుతున్నారని, ఇది న్యాయం కాదని, వెంటనే వెనక్కి తిరిగి చెల్లించాలని బి గోపాలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. . అసలు పెన్షనర్స్ నుండి హెల్త్ కార్డుల కొరకు ఒకటి పాయింట్ ఐదు శాతం వినయింపు ఇవ్వాలి, వసూలు చేయరాదు. . ప్రాథమిక హక్కులో భాగంగా పెన్షనర్స్ కు అందాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందక చాలా మంది మరణించారని ఈ మరణాలకు ప్రభుత్వమే కారణమని ఆయన తెలిపారు. 2023 నుండి పెండింగ్లో ఉన్న డి ఎ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని, ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వేతన సవరణ పి ఆర్ సి ని రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ప్రకటించాలని బి.గోపాలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమధ్య ప్రభుత్వ ప్రచారము:- బ్యాంకుల ద్వారా పెన్షనర్స్ కు ప్రమాద బీమా పథకాలను ప్రకటించాయి. సాధారణంగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే వేతనాన్ని బట్టి రూ. 30 లక్షల నుండి కోటి వరకు పరిహారం ఇస్తామని బ్యాంకులు వెల్లడించాయి. ఈ బీమా సౌకర్యాలు బ్యాంకులు ఖాతాదారులను ఆకర్షించడానికి మాత్రమే, బతికున్నప్పుడు రాని బకాయిలు సచ్చాక వచ్చే కోట్లు ఎవరికీ కావాలి, ఇది ఎలాంటి న్యాయం, ప్రస్తుత ఆర్థిక అవసరాల కోసం, పిల్లల చదువులు, వైద్య ఖర్చులకోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం పెన్షనర్స్ అప్పుల పాలవుతుంటే, ప్రభుత్వము మీరు చనిపోతే కోట్లు వస్తాయి అనడం పెన్షనర్స్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే, పెన్షనర్స్ న్యాయం అయిన డిమాండ్ల నూతన పిఆర్సి అమలు, పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేసి ,వారి కుటుంబాలకు భద్రత, భరోసా కల్పిస్తారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బి.గోపాలం. ఇంకో విషయం ప్రస్తుతం పని చేయుచున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తామని క్యాబినెట్ మీటింగ్ లో ప్రభుత్వము ప్రకటించడం విడ్డూరంగా ఉంది, ఉపాధ్యాయులు అడిగారా, అడుగుచున్నవి ఇవ్వాల్సిన డి ఏ లను, నూతన పిఆర్సిని వెంటనే ప్రకటిస్తే అందరూ సంతోషిస్తారని బి.గోపాలం తెలిపారు.