Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రైతు భరోసా నిధుల విడుదలపై హర్షాతిరేకాలు: కొండమల్లేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం

    Author VENKATESH | 08 Jul 2026, 12:11 PM | నల్గొండ
    రైతు భరోసా నిధుల విడుదలపై హర్షాతిరేకాలు: కొండమల్లేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం

    దేవరకొండ 08జూలై (BVK 3 న్యూస్ ) : రైతు భరోసా నిధుల విడుదలను స్వాగతిస్తూ కొండమల్లేపల్లి చౌరస్తాలో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గార్ల "చిత్రపటాలకు పాలాభిషేకం" చేసిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్.తెలంగాణ రైతాంగం ఆర్థికంగా బలోపేతం కావాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతోందని, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పేర్కొన్నారు.రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్న సందర్భంగా బుధవారం ఉదయం కొండమల్లేపల్లి చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ పున్న కైలాష్ నేత కూడా పాల్గొని రైతు భరోసా నిధుల విడుదలను స్వాగతించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ... రైతు చెమటకు విలువ తెలిసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. గతంలో రైతులు పంట పెట్టుబడుల కోసం ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఇప్పుడు రైతులకు ఆర్థిక భరోసా కల్పించేలా రైతు భరోసా నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తూ ప్రభుత్వం రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోందని తెలిపారు.
    ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, రైతుల శ్రేయస్సే రాష్ట్ర అభివృద్ధికి మూలాధారమనే నమ్మకంతో ప్రతి నిర్ణయం తీసుకుంటోందన్నారు. రైతు భరోసా నిధుల విడుదల, రైతులకు నాణ్యమైన విత్తనాల అందుబాటు, సాగునీటి వసతుల మెరుగుదల, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.రైతును కేవలం ఓటరుగా కాకుండా దేశానికి అన్నదాతగా గౌరవించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, రైతు కుటుంబం బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రైతు సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త దిశను చూపుతోందని కొనియాడారు.
    ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రైతు భరోసా నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు.