Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నల్లగొండ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల హామీ - జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యురాలు యేకుల అనిత సురేష్

    Author VENKATESH | 09 Jul 2026, 01:12 PM | నల్గొండ
    నల్లగొండ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల హామీ - జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యురాలు యేకుల అనిత సురేష్

    దేవరకొండ 09జూలై (BVK 3 న్యూస్ ) : నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ రెండవ సమావేశంలో కమిటీ సభ్యురాలు యేకుల అనిత సురేష్ పాల్గొనడం జరిగింది.
    ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని పలు కీలక సమస్యలను గౌరవ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్లాను.
    స్టేషన్ల వద్ద ఇబ్బందులు: బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లి పిటిషన్ ఇస్తే, ఎస్సై లేరనే సాకుతో వారిని తిరిగి పంపిస్తున్నారని ఎస్పీ గారికి తెలియజేశాను. ఎస్సై ఉన్నప్పుడే రావాలని చెప్పడం వల్ల బాధితులు పలుమార్లు స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, వారి సమయం మరియు డబ్బు వృధా అవుతుందని వివరించారు. ఈ విధానం మారాలని, బాధితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన పరిష్కారం లభించేలా చూడాలని కోరారు.
    భూ సమస్యల పరిష్కారం: కనగల్ మండలంలో ఎస్సీలకు చెందిన భూమిని అక్రమంగా తప్పుడు పత్రాలతో పట్టా చేయించుకున్నట్లు తమ దృష్టికి వచ్చిన విషయాన్ని కలెక్టర్ గారికి వివరించారు. ఆ బాధితులకు తక్షణమే న్యాయం చేసి, వారి భూమి వారికి తిరిగి చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
    ​కేసుల సత్వర పరిష్కారం: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి విచారణలో మరియు పెండింగ్ ట్రయల్స్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేలా చొరవ చూపాలని కోరారు. అదేవిధంగా బాధితులకు ప్రభుత్వం నుండి అందాల్సిన ఆర్ధిక సహాయం కూడా త్వరిత గతిన అందించాలని కోరారు.
    అధికారుల సానుకూల స్పందన:
    నా విజ్ఞప్తులపై గౌరవ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు సానుకూలంగా స్పందించారు.భూమి కోల్పోయిన వారిది పర్యవేక్షణ చేపిస్తామని, స్టేషన్ కు వెళ్ళే బాధితులు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినా తక్షణమే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అలాగే పోలీస్ స్టేషన్లలో ఎస్.ఐ అందుబాటులో లేకపోయినా హెడ్ కానిస్టేబుల్ ద్వారా కూడా కేసు నమోదు చేసుకునేలా చూస్తామని తెలిపారు.
    ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించిన వారు, వాటన్నింటినీ తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.