Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేపు రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్ఎఫ్ పిలుపు

    Author VENKATESH | 09 Jul 2026, 04:34 PM | నల్గొండ
    రేపు రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్ఎఫ్ పిలుపు

    దేవరకొండ 09జూలై (BVK 3 న్యూస్ ) : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జులై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ,ఏఐఎస్ఎఫ్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు బుడిగ వెంకటేష్,వట్టేపు శివ కుమార్ పిలుపునిచ్చారు.
    దేవరకొండ పట్టణంలో నిర్వహించిన పత్రిక ప్రకటన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వం కాలేజీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వేలాది మంది విద్యార్థులు చదువును కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.అదేవిధంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న జులై 10 విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు,తల్లిదండ్రులు, ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు అంకూరి ప్రణయ్,దుళ్ల కార్తీక్,బత్తుల శివ, పులిజాల శివ,జెటమోని సతీష్, పల్లె చైతన్య, దాసరి శివ, నాయకులు దర్శనం సతీష్,ఎం నితిన్, తదితరులు పాల్గొన్నారు.