Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ భద్రతపై అవగాహన సదస్సు

    Author VENKATESH | 09 Jul 2026, 09:05 PM | నల్గొండ
    దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ భద్రతపై అవగాహన సదస్సు

    దేవరకొండ 09జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ధన్ ఫౌండేషన్ సిఎఫ్ఎల్ కోఆర్డినేటర్ రాపర్తి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో డిజిటల్ భద్రత,ఆర్థిక అక్షరాస్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు,ఆన్లైన్ మోసాలు,సైబర్ నేరాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవల సురక్షిత వినియోగం, యుపిఐ లావాదేవీలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.
    సైబర్ నేరగాళ్లు ఉపయోగించే వివిధ మోసపూరిత పద్ధతులను వివరించి వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకూడదని సూచించారు.అనుమానాస్పద లింకులు,ఫోన్ కాల్స్, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.విద్యార్థు లు ఆసక్తిగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్, శ్రీదేవి,దేవరకొండ అసోసియేట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.