Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేశ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర

    Author VENKATESH | 09 Jul 2026, 09:22 PM | నారాయణపేట
    దేశ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర

    - ప్రతీ విద్యార్థి జాతీయవాద దృక్పథాన్ని అలవర్చుకోవాలి
    - విద్యార్థి శక్తిని జాతీయ శక్తిగా మార్చడంలో ఏబీవీపీ నిరంతర కృషి అభినందనీయం
    - జాతీయ పునర్నిర్మాణంలో ఏబీవీపీ తో విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలి
    - పిలుపునిచ్చిన ఆర్ ఎస్ ఎస్ విభాగ్ ప్రచారక్ దేవేందర్
    నారాయణపేట, జూలై 9 (బివికె న్యూస్)
    దేశ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్రని, ప్రతీ విద్యార్థి జాతీయవాద దృక్పథాన్ని అలవర్చుకోవాలనీ,విద్యార్థి శక్తిని జాతీయ శక్తిగా మార్చడంలో ఏబీవీపీ నిరంతర కృషి అభినందనీయమని,జాతీయ పునర్నిర్మాణంలో ఏబీవీపీ తో విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలనీ పిలుపుచ్చారు ఆర్ ఎస్ ఎస్ విభాగ్ ప్రచారక్ దేవేందర్.
    అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం ABVP మఖ్తల్ శాఖ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం, నో డ్రగ్స్ సొసైటీ క్యాంపెయిన్ కార్యక్రమాలు నిర్వహించారు. మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో నిర్వహించిన నో డ్రగ్ సొసైటీ కార్యక్రమంలో ఏబీవీపీ పట్టణ అధ్యక్షులు అంజిరెడ్డి పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ప్రచార దేవేంద్ర మాట్లాడుతూ
    విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండి చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులు గా ఎదగాలనన్నారు.కుటుంబ నిర్మాణం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు.విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక అవగాహన కూడా ఎంతో అవసరమని, ఎబివిపి చేపట్టే ప్రతి కార్యక్రమంలో విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలని దేవేందర్ జీ సూచించారు.
    కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య ఏబీవీపీ నగర అధ్యక్షులు అంజిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ వసుంధర , ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్ కుమార్,నగర కార్యదర్శి వంశీ, శరణ్,సందీప్,రమేష్, అభి, తదితరులు పాల్గొన్నారు.