Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం

    Author VENKATESH | 10 Jul 2026, 08:11 PM | నారాయణపేట
    మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం

    జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీస్
    నారాయణపేట, జూలై 10 (బి వి కే న్యూస్ )
    నారాయణపేట జిల్లాలో మహిళలు, యువతులు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, బాలికలు ఆకతాయిల వేధింపులు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, గృహహింస, లైంగిక వేధింపులు లేదా ఇతర ఏ విధమైన అన్యాయాలకు గురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని కోరారు.
    పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, పార్కులు, ప్రజా ప్రదేశాలు, గ్రామాలు, కాలనీలు, కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే షీ టీమ్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళలపై జరిగే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంతో స్వీకరించి, విచారణ చేపట్టి నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
    మైనర్ బాలికలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక వేధింపులకు పాల్పడినా, సోషల్ మీడియా ద్వారా అసభ్య సందేశాలు పంపినా, ఫోటోలు లేదా వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసినా, వెంటాడినా సంబంధిత నిందితులపై పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఇటువంటి నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
    గృహహింసకు గురవుతున్న మహిళలు కూడా మౌనంగా బాధపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, బాధితులకు అవసరమైన న్యాయం అందించేందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. మహిళల ఫిర్యాదులపై సత్వర స్పందనతో పాటు నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
    జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, కళాశాలల్లో మహిళా భద్రత, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను నిర్లక్ష్యంగా పంపవద్దని, అనుమానాస్పద లింకులు లేదా ఖాతాలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
    మహిళలు, బాలికలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేని పరిస్థితుల్లో షీ టీమ్ ఫోన్ నంబర్ 8712670398 లేదా డయల్–100కు సమాచారం అందించాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.