Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి

    Author VENKATESH | 10 Jul 2026, 08:13 PM | నారాయణపేట
    ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి

    నారాయణపేట, జూలై 10 (బి వి కే న్యూస్)
    రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీ హరి ఆదేశాల మేరకు మక్తల్ 12,వ వార్డు కు సంబంధించిన నూతన ఇందిరమ్మ ఇంటి గృహాన్ని శుక్రవారం రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి, మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ట సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 15 సంవత్సరాలలో గత ప్రభుత్వ హాయంలో ఏ ఒక్క ఉచిత ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు ఎంతో నమ్మకంతో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని ఇవ్వడం జరిగిందని నేడు పట్టణములో పల్లెల్లో ఎంతమంది పేద ప్రజలు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకొని సంతోషంగా గృహప్రవేశ్యాలు చేసుకుంటున్నారని వారన్నారు.
    ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు వాకిటి శేషగిరి కట్ట సురేష్ ,మున్సిపల్ కౌన్సిలర్ రహీమ్ పటేల్,కాంగ్రెస్ నాయకులు వాకిటి హన్మంతు,మున్సిపల్ కౌన్సిలర్స్ వెంకటేష్, కో ఆప్షన్ మెంబర్ హుసామోద్దీన్, నాగరాజు,రాజేంద్ర,ఓబ్లేష్ ,తదితరులు పాల్గొన్నారు.