Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మక్తల్ ల్లో ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

    Author VENKATESH | 10 Jul 2026, 08:14 PM | నారాయణపేట
    మక్తల్ ల్లో ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

    - కేక్ కట్ చేస్తూ మత్సకారుల దినోత్సవం జరుపుకున్న మత్స్యకారులు
    నారాయణపేట, జూలై 10 (బి వి కే న్యూస్)
    జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలోని మత్స్యశాఖ భవన్ లో మత్స్యకారుల దినోత్సవం వేడుకలను సొసైటీ అధ్యక్షులు కోళ్ల వెంకటేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా
    జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా, సముద్రం, నదులు, చెరువులు ఆధారంగా జీవనం సాగిస్తున్న మత్స్యకారుల సేవలను గుర్తు చేసుకుంటూ అసువులు బాసిన వారికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
    దేశ ఆర్థిక వ్యవస్థలో, ఆహార భద్రతలో, గ్రామీణ ఉపాధి కల్పనలో మత్స్యకారుల పాత్ర ఎంతో కీలకమైనది. ఈ రంగం ద్వారా లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి లభిస్తోందని అధ్యక్షులు కోళ్ల వెంకటేష్ అన్నారు .
    మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. మత్స్యరంగ అభివృద్ధి, ఆధునిక సాంకేతికత వినియోగం, మత్స్య నిల్వ, మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం దిశగా చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. మత్స్యకారుల భద్రత, ఆదాయ స్థిరత్వం, యువతకు ఉపాధి అవకాశాల పెంపు ఈ దినోత్సవం ముఖ్య మైనదని అన్నారు.
    మత్స్య సంపద పరిరక్షణ, జలవనరుల సుస్థిర వినియోగం, మత్స్యకారుల జీవిత ప్రమాణాల మెరుగుదల మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మత్స్యకారుల కష్టానికి గౌరవం, అభివృద్ధికి మద్దతు, సంక్షేమానికి అండగా నిలవడం ద్వారా సమర్థవంతమైన మత్స్యరంగం సాధ్యమవుతుందన్నారు.
    ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వాకిటి శ్యాం కుమార్ ప్రధాన కార్యదర్శి చందాపురం చంద్రశేఖర్ డైరెక్టర్లు కర్నె గోపి అంజయ్య చారి కట్ట వెంకటేష్ పృథ్వీరాజ్ ఆలంపల్లి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.