Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన బాధ్యతాయుత నాయకులకు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ అభినందనలు

    Author VENKATESH | 11 Jul 2026, 08:47 PM | నల్గొండ
    నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన బాధ్యతాయుత నాయకులకు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ అభినందనలు

    దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) : "నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ"లో నూతనంగా వివిధ బాధ్యతలకు నియమితులైన జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ ఆలంపల్లి నర్సింహా , శ్రీ ముక్కమల్ల వెంకటయ్య గౌడ్ , ప్రధాన కార్యదర్శులు శ్రీ కుక్కల గోవర్ధన్ రెడ్డి , శ్రీ హనుమంతు వెంకటేష్ గౌడ్ , శ్రీ ఊట్కూరు వేమన్ రెడ్డి , శ్రీ ఎరుకల వెంకటయ్య గౌడ్ , శ్రీ మేకల రాజేందర్ రెడ్డి , శ్రీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , అధికార ప్రతినిధి శ్రీ ముచర్ల యాదగిరి , కార్యదర్శులు శ్రీ జర్పుల భద్య నాయక్ , శ్రీ నల్లవెల్లి రాజేష్ రెడ్డి , శ్రీ లోకసాని కృష్ణయ్య , శ్రీ వీరబోయిన యల్లయ్య యాదవ్ , శ్రీ మద్దిమడుగు రామస్వామి గారికి దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి కార్యకర్తతో సమన్వయం చేసుకుంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ కోసం నిస్వార్థంగా, క్రమశిక్షణతో, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ నాయకత్వం తప్పకుండా గుర్తిస్తుందని, వారి సేవలకు తగిన గౌరవం, బాధ్యతలు, పదవులు లభిస్తాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల కష్టానికి ఎప్పుడూ విలువ ఉంటుందని, పార్టీ అభివృద్ధి కోసం శ్రమించే వారికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని అన్నారు.
    నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులందరూ జిల్లా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పిలుపునిచ్చారు.