Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే దేశాభివృద్ధి - దేవరకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం

    Author VENKATESH | 13 Jul 2026, 09:42 PM | నల్గొండ
    యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే దేశాభివృద్ధి - దేవరకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం

    దేవరకొండ 13జూలై (BVK 3 న్యూస్ ) : మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), దేవరకొండలో ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
    ​ఈ కార్యక్రమానికి కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ జి. కోటయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంఖ్యలో యువత మన దేశంలో ఉన్నారు. జనాభా పెరిగే కొద్దీ అనేక సమస్యలు, సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ యువత వివిధ రంగాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని, సంపద సృష్టించే సామర్థ్యాన్ని అలవరచుకుంటే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది," అని పేర్కొన్నారు.
    ​ఈ కార్యక్రమంలో ఎకనామిక్స్ విభాగాధిపతి & కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, అధ్యాపకులు డాక్టర్ కె. రేణుక, డాక్టర్ వి. మకట్లాల్, జగపతిబాబు, శ్రీనివాస్, నాగరాజు, శ్రీను, నర్మదా దేవి మరియు విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.