Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గుడిపల్లిలో జాతీయ నూలు పురుగుల నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహణ

    Author VENKATESH | 13 Jul 2026, 09:45 PM | నల్గొండ
    గుడిపల్లిలో జాతీయ నూలు పురుగుల నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహణ

    దేవరకొండ 13జూలై (BVK 3 న్యూస్ ) : గుడిపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాల వేదికగా జాతీయ నూలు పురుగుల నిర్మూలన దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గుడిపల్లి సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.
    ఈ సందర్భంగా గుడిపల్లి పీహెచ్‌సీ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, 1 నుండి 19 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలందరికీ నూలు పురుగుల నివారణ కోసం ప్రభుత్వం ఈ మాత్రలను ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. ఈ మాత్రలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు నూలు పురుగుల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
    ​ఈ కార్యక్రమంలో గుడిపల్లి మండల ఎంఈఓ సముద్రాల శీనయ్య, గ్రామ పంచాయతీ సెక్రెటరీ విజయ్ రెడ్డి, గుడిపల్లి గ్రామ ఉపసర్పంచ్ అరవపల్లి శ్రీను, మాజీ సర్పంచ్ మోపురి ఆంజనేయులు, వడ్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీహెచ్ఎస్ మరియు ప్రాథమిక పాఠశాల సిబ్బంది, ఆశా వర్కర్లు, పీహెచ్‌సీ సిబ్బంది గోవిందు తదితరులు పాల్గొన్నారు.