Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ లయన్స్ క్లబ్ 39వ ప్రమాణస్వీకారం

    Author VENKATESH | 17 Jul 2026, 09:18 PM | నల్గొండ
    దేవరకొండ లయన్స్ క్లబ్ 39వ ప్రమాణస్వీకారం

    ప్రెసిడెంట్ లయన్ గుద్దేటి జంగయ్య
    దేవరకొండ 17జూలై (BVK 3 న్యూస్ ) :
    దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. దేవరకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా గుద్దేటి జంగయ్య ,ప్రధాన కార్యదర్శిగా కసిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారిగా చిలుకూరి కాశీనాథ్ జోన్ చైర్మన్గా గాజుల ఉషారాణి లను ఎం జె ఎఫ్ లయన్ మదన్మోహన్ రేపాల ఎం జె ఎఫ్ లయన్ సతీష్ కుమార్ కోడె వీడిజీ1 సభ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు .ఈ సందర్భంగా లయన్స్ మదన్మోహన్ రేపాల సతీష్ కుమార్ కోడె మాట్లాడుతూ లయన్స్ క్లబ్ లో పని చేయడం పూర్వజన్మ సుకృతం అని తెలిపారు. జన్మజన్మలకు లయన్స్ క్లబ్ లోనే పనిచేసే విధంగా సభ్యులు సిద్ధం కావాలని తెలిపారు. నూతన అధ్యక్షుడు లయన్ గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ గత సంవత్సరానికి భిన్నంగా తమ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. సభ్యుల సహకారం అందిస్తే లయన్స్ క్లబ్ విద్యా వైద్య ఆరోగ్య కార్యక్రమాలను గ్రామ గ్రామాన తీసుకెళ్తానని తెలిపారు. నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సి ఏచూరి భాగ్యలక్ష్మి జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి సీనియర్ లయన్స్ హాజరయ్యారు .నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గుద్దేటి జంగయ్యను స్నేహితులు శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.