Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వాహనాలను ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచుకోవాలి: ఎం టి ఓ ఆర్ఐ విజయభాస్కర్

    Author VENKATESH | 18 Jul 2026, 09:37 PM | నారాయణపేట
    వాహనాలను ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచుకోవాలి: ఎం టి ఓ  ఆర్ఐ విజయభాస్కర్

    నారాయణపేట, జూలై 18 (బి వి కే న్యూస్)
    నారాయణపేట జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో శనివారం రోజు MTO, ఆర్ఐ విజయభాస్కర్ పోలీసు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉపయోగించే ప్రతి పోలీసు వాహనం ఎల్లప్పుడూ సాంకేతికంగా మెరుగైన స్థితిలో ఉండేలా చూసుకోవాలని, వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని పోలీసు డ్రైవర్లకు సూచించారు.
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీసు వాహనాలు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల వాటిని ప్రతిరోజూ శుభ్రపరచడంతో పాటు ఇంజిన్, బ్రేకులు, టైర్లు, లైట్లు, సైరన్, బ్యాటరీ తదితర భాగాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని తెలిపారు. చిన్నచిన్న లోపాలు కనిపించిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేయించాలని సూచించారు.
    వాహనాలను నడిపే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు డ్రైవర్లు పూర్తి ఏకాగ్రతతో వాహనాలు నడపాలని, సెల్‌ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు.
    మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు డ్రైవర్లు ప్రజలకు ఆదర్శంగా ఉండేలా క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, రోడ్డు భద్రతా నియమాలను ప్రతి సందర్భంలో పాటించాలని కోరారు.
    వాహనాలకు సంబంధించిన రికార్డులు, ఇంధన వినియోగం, సర్వీసింగ్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ నిర్వహణలో పారదర్శకత పాటించాలని సూచించారు. పోలీసు వాహనాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటే అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు.
    ఈ తనిఖీ సందర్భంగా పోలీసు డ్రైవర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.