Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మున్సిపల్ కార్మికుల వేతనాలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఎండార్స్మెంట్ ను రద్దు చేయాలి

    Author VENKATESH | 18 Jul 2026, 09:45 PM | నారాయణపేట
    మున్సిపల్ కార్మికుల వేతనాలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఎండార్స్మెంట్ ను రద్దు చేయాలి

    ఎస్ కిరణ్ టి యూ సి ఐ జిల్లా అధ్యక్షులు
    నారాయణపేట, జూలై 18 (బి వి కె న్యూస్)
      మున్సిపల్ కార్మికులకు వేతనాలు తగ్గిస్తూ ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వం ఎండార్స్మెంట్ విడుదల చేసింది. దీని వ్యతిరేకంగా టియుసిఐ ఆధ్వర్యంలో శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు.
    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నెలరోజుల క్రితం కార్మికులకు జీవో నెంబర్ 6 విడుదల చేసింది. దీంట్లో మూడు జోన్లుగా అనగా  1)మున్సిపల్ కార్పొరేషన్, 2)మున్సిపాలిటీ, 3)గ్రామీణ ప్రాంతం గా విభజన చేసింది. దీనికనుగుణంగా ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్  కార్మికులకు వేతనం నిర్ణహిస్తూ మున్సిపాలిటీలకు ఎండార్స్మెంట్ విడుదల చేసింది.  ప్రస్తుతం అమలు అవుతున్న జీవో నెంబర్  60 ప్రకారం మూడు క్యాటగిరీల విభజించి ఉంది. కేటగిరి 1 ప్రకారం రూ 16,600 /-, కేటగిరి 2 ప్రకారం రూ 19,500/- కేటగిరి 3 ప్రకారం రూ 22,750/- వేతనాలు అమలు అవుతున్నాయి.
    రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎండార్స్మెంట్ లో  మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 63, 60 లలోని తక్కువ వేతనాలు ఇవ్వాలని ఉంది. దీని కారణంగా మున్సిపాలిటీ కార్మికులకు ఉన్న వేతనంలో  రూ 1000 నుండి రూ 3000 రూపాయలు వేతనం తగ్గుతుంది. ఇది మున్సిపల్ కార్మికుల పొట్టగోట్టడమే అని అన్నారు.
    నిత్యవసర సరుకుల ధరలు ఒకపక్క విపరీతంగా పెరిగిపోయి వస్తున్న వేతనాలే సరిపోని స్థితిలో కార్మికులు కొట్టుమిట్టాడుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేతనాలు తగ్గించడం అంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. వేతన సంఘం సిఫారసు చేసిన 26 వేల వేతనం పెంచాల్సింది పోయి వేతనంలో కోత విధిస్తారా?. లేదా సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సిన స్థితి ఉంది. ఎన్నికల ముందు మాది కార్మిక సంక్షేమ ప్రభుత్వమని, ప్రజాపాలనాని, ప్రజలకు జవాబుదారితనంగా ఉంటామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాలు తగ్గించడం అంటే దొడ్లో జొర్ర కొట్టి గుర్తుప అందుకున్న చందంగా ఉంది.
    స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి గారు క్యాబినెట్లో ఇలాంటి వేతనాలపై చర్చ జరుగుతున్నప్పుడు స్పందించాల్సిన అవసరం ఉన్నది వేతనాలు తగ్గిస్తూ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి కార్మికుల తరఫున నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల పుట్టగొట్టడం మంచిది కాదని చెప్పడానికి సిద్ధంగా కావాలని కోరుతున్నాము లేనిపక్షంలో కార్మికుల ఆందోళన బాట పట్టాల్సిందే అవసరం వస్తుంది. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎండార్స్మెంట్ రద్దు చేస్తూ కేంద్ర వేతన సంఘం సిఫార్సు చేసిన 26 వేల రూపాయల వేతనాన్ని అమలు చేయాలని టి యు సి ఐ డిమాండ్ చేస్తా ఉన్నది
    కార్యక్రమంలో గంగన్న, ఆశన్న, రవి, బండారి బాలు, జి కృష్ణయ్య, సుజాత, ఆకాశ్, హన్మంతు, రామలింగం, వెంకటేష్, డి నర్సింలు, బండారి మల్లేష్, మారుతి, మారెప్ప జగ్గలి బాబు, జగ్గలి ఆంజనేయులు జె అంజప్ప, అంజన్ ప్రసాద్ దితరులు పాల్గొన్నారు.