Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చంద్రన్న ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో ఉన్నత చదువులు చదివి నర్సింగ్ ఆఫీసర్ గా పేదింటి బిడ్డ- అంకురి అశ్విని

    Author VENKATESH | 18 Jul 2026, 09:50 PM | నల్గొండ
    చంద్రన్న ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో ఉన్నత చదువులు చదివి నర్సింగ్ ఆఫీసర్ గా పేదింటి బిడ్డ- అంకురి  అశ్విని

    - పేదింటి బిడ్డ అశ్విని వివాహానికి రూ. 75.000 వేల ఆర్థిక సహాయం - చంద్రన్న ఫౌండేషన్
    - ​అశ్వినిని శాలువాతో ఘనంగా సత్కరించిన చైర్మన్ హనుమంతు వెంకటేష్ గౌడ్
    దేవరకొండ 18జూలై (BVK 3 న్యూస్ ) : ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద విద్యార్థులను ఆదుకుని, వారి ఉన్నత చదువులకు భరోసా కల్పించడమే ధ్యేయంగా చంద్రన్న ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోందని ఆ ఫౌండేషన్ చైర్మన్ హనుమంతు వెంకటేష్ గౌడ్ అన్నారు. చంద్రన్న ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో ఉన్నత చదువులు పూర్తి చేసి, ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించిన పేదింటి బిడ్డ అంకురి అశ్వినిని ఫౌండేషన్ ప్రతినిధులు ఘనంగా అభినందించారు.
    ​ఈ సందర్భంగా చంద్రన్న పౌండేషన్ చైర్మన్ హనుమంతు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. అంకురి అశ్విని ఉన్నత చదువుల కోసం చంద్రన్న ఫౌండేషన్ ఆర్థిక సహాయం చేసిందని అలాగే పేదింటి బిడ్డ అంకూరి అశ్విని వివాహానికి 75, 000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు గుర్తుచేశారు. ఆ సాయాన్ని సద్వినియోగం చేసుకుని, పట్టుదలతో చదివి ఈ రోజు నర్సింగ్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. శ్రమించే తత్వం, చదువుకోవాలనే కసి ఉంటే పేదరికం అడ్డుకాదని అశ్విని నిరూపించిందని ఆయన కొనియాడారు.
    ​అనంతరం నర్సింగ్ ఆఫీసర్‌గా నియమితురాలైన అంకురి అశ్విని ని చంద్రన్న ఫౌండేషన్ చైర్మన్ హనుమంతు వెంకటేష్ గౌడ్ శాలువాతో ఘనంగా సత్కరించి, మెమెంటో అందజేసి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అశ్విని మాట్లాడుతూ... నా యొక్క ఉన్నత చదువులకు, వివాహానికి ఆర్థికంగా సహకరించిన చంద్రున్న ఫౌండేషన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, స్థానిక నాయకులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.