Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన ట్రస్ట్ ఎన్నిక

    Author VENKATESH | 18 Jul 2026, 09:52 PM | నల్గొండ
    శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన ట్రస్ట్ ఎన్నిక

    ఆలయ అధ్యక్షులుగా బండారు సుధాకర్ (రాము)
    ​ప్రధాన కార్యదర్శిగా మారం భాస్కర్ రెడ్డి, కోశాధికారిగా పాంపాటి శ్రీధర్ ఏకగ్రీవ ఎన్నిక
    దేవరకొండ 18జూలై (BVK 3 న్యూస్ ) :
    శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన ట్రస్టును ఏర్పాటు చేసే క్రమంలో శనివారం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బండారు సుధాకర్( రాము), ప్రధాన కార్యదర్శిగా మారం భాస్కర్ రెడ్డి, కోశాధికారిగా పాంపాటి శ్రీధర్ లను పెద్దలు కమిటీ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొండమల్లేపల్లి పట్టణంలోని హైదరాబాదు రోడ్డులో గల మల్లెల గట్టు పై శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్వర్గీయ దివంగత నేత కుంభం పుల్లారెడ్డి సుజాతమ్మలు నిర్మించారు. ఈ పుణ్యక్షేత్రానికి అర్థగిరి క్షేత్రంగా నామకరణం చేశారు. తదనంతరం వారి వారసులు కుంభం మనోహర్ రెడ్డి సునీత దంపతులు దేవాలయ శాశ్వత ధర్మకర్తలు ఆలయ అభివృద్ధి కోసం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పెద్దలు కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వారిని కమిటీలో తీసుకోవాలన్నారు. త్వరలో పూర్తిస్థాయి కమిటీ ప్రకటిస్తామని నూతనంగా ఎన్నికైన సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన దేవాలయ ట్రస్ట్ అధ్యక్షులు బండారు సుధాకర్, ప్రధాన కార్యదర్శి మారం భాస్కర్ రెడ్డి, కోశాధికారి పాంపాటి శ్రీధర్ లను ఆలయ శాశ్వత ధర్మకర్త కుంభం మనోహర్ రెడ్డి తో పాటు పలువురు పెద్దలు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అలంపల్లి నరసింహ, మాజీ ఎంపీపీ రేఖ శ్రీధర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పసునూరు యుగంధర్ రెడ్డి, నాయిని మాధవరెడ్డి, మారం రవీందర్ రెడ్డి, జాలె నరసింహారెడ్డి, కేసాని లింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కాసర్ల వెంకటేశ్వర్లు, ఊట్కూరి వేమన్ రెడ్డి, చెట్లపల్లి శ్రీనివాస్, నూతన గంటి ఈశ్వర్, దాచేపల్లి నరేందర్, తడకమళ్ళ శ్రీనివాస్, దొడ్డి సుధాకర్, ఎలిమినేటి సాయి, ఏరుకొండ రాము, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.