Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉత్సాహభరితంగా బాలురకు సైక్లింగ్ పోటీలు

    Author VENKATESH | 19 Jul 2026, 09:44 PM | నారాయణపేట
    ఉత్సాహభరితంగా బాలురకు సైక్లింగ్ పోటీలు

    - సైక్లింగ్ పోటీలను ప్రారంభించిన జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం
    నారాయణపేట, జూలై 19 (బివికే న్యూస్)
    తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వారి ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా సైకిలింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు మక్తల్ ఎల్లమ్మ కుంట కొత్త గార్లపల్లి రోడ్డులో14 ,15 ,16 సంవత్సరాల బాలురకు సైకిలింగ్ పోటీలను ప్రధాన కార్యదర్శి బి.గోపాలం, ఉపాధ్యక్షుడు జి .శివకుమార్ ప్రారంభించారు. ఈ పోటీలలో క్రీడా నైపుణ్యతను క్రీడా ప్రతిభను చాటిన విద్యార్థులను ఎంపిక చేసి, ఈనెల 20న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో గల వేలోడ్రమ్ ( VELODROME) సైకిలింగ్ అకాడమీ లో ప్రవేశం కొరకు, జరుగు సైకిలింగ్ పోటీల లో పాల్గొంటారని బి.గోపాలం తెలిపారు . ఈ పోటీలలో 76 మంది బాలురు పాల్గొన్నట్లు బి.గోపాలం తెలిపారు. ఈ పోటీలలో పాల్గొని అసమాన క్రీడాన్నే పుణ్యం ప్రదర్శించి రాష్ట్రస్థాయి సైకలింగ్ క్రీడా అకాడమీకి పోటీలకు ఎంపికైన బాలురు:-_బి. అర్జున్ కుమార్, అక్షయ్ కుమార్, బి .వెంకటేష్, జి. రమేష్, బి. గోపిచంద్ ,లోకేష్, శ్రీనాథ్, జనార్ధన్ ,వేణుగోపాల్ ,విగ్నేష్ ,అవినాష్, అభిలాష్, ఆకాష్, మనోహర్ ,పురుషోత్తం, వెంకటేష్ ,మహేష్, అశోక్,పాల్గొన్నట్లు బి.గోపాలం తెలిపారు.
    ఈ కార్యక్రమంలో పిడి, పీఈటీలు, రేణుక,, మీనా కుమారి, అమ్రేష్, దామోదర్, స్వప్న, చంద్రకళ, బోయ లలిత, అవంతి, యాదగిరి, బుడ్డప్ప, పాల్గొన్నారు.