Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బుధవారం చలో మాల నల్లగొండ కలెక్టరేట్:- మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి

    Author VENKATESH | 21 Jul 2026, 11:00 AM | నల్గొండ
    బుధవారం  చలో మాల నల్లగొండ  కలెక్టరేట్:- మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి

    దేవరకొండ 20జూలై (BVK 3 న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కు విరుద్ధంగా.. ఏంపరికల్ డాటా పరిగణలోకి తీసుకోకుండా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆగస్టు 1 2024 న వర్గీకరణ చేసింది 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జన గణన చేయకుండా ఎస్సీ కులాలలో మాల జనాభాను తక్కువ చూయిస్తూ ఎస్సీ వర్గీకరణ చేసి 5 % కేటాయిస్తూ మాలలకు అన్యాయం చేసిందని అన్నారు. రోస్టర్ విధానాన్ని అమలు చేసిన విధానాన్ని ఖండిస్తూ బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో లో బుధవారం జరిగే మాల మహానాడు రిలే నిరాహార దీక్షను చేపడుతున్న మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి పిలుపుమేరకు మద్దతుగా దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాల నుండి మాల మేధావులు యువకులు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి రిలే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తీరును నిరసిస్తూ అదేవిధంగా రోస్టర్ విధానంలో మాలలకు తీవ్ర నష్టము జరిగిందని అన్నారు రోస్టర్ విధానంపై జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మాల మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో రోస్టర్ విధానం పై చర్చ జరిపి మాలలకు న్యాయం జరిగే విధంగా రోస్టర్ విధానం పై 1 నుండి16 లోపు రెండు రోస్టర్ పాయింట్లు వచ్చే విధంగా సవరణ చేయాలని పిలుపునిచ్చారు
    మాలలంతా ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి అధికారంలోకి రావడానికి కృషి చేసినప్పటికీ... కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు అన్యాయ చేయడం జరిగింది. అన్నారు రోస్టర్ విషయంలో ఎక్కడికక్కడ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రోస్టర్ విధానాన్ని సవరణ చేయకపోతే వచ్చే ఎలక్షన్స్ లో మాలల పంతం - కాంగ్రెస్ ప్రభుత్వం అంతం అనే నినాదంతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు ఆనాడు
    పదవుల కోసం, పార్టీలకు వారసులం అనుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్... మనకు ఇన్ని హక్కులు సాధించేవారు కాదు...
    కేంద్ర న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని.
    మన ప్రజా ప్రతినిధులకు గుర్తులేదా .. అని రాబోయే రోజులలో విద్య ఉద్యోగ, అవకాశాలలో మాలలు మేలుకోకపోతే రాబోయే తరాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పిలుపునిచ్చారు.