Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పోలీసు కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం

    Author VENKATESH | 21 Jul 2026, 11:02 AM | నారాయణపేట
    పోలీసు కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం

    - జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్
    - మరణించిన పోలీసు కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత..
    నారాయణపేట, జూలై 20 (బి వి కే న్యూస్)
    విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS తెలిపారు.
    నారాయణపేట జిల్లా డీఏఆర్‌కు చెందిన దివంగత ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కె. బాల నర్సింహులు (ARHC-347) సతీమణి శ్రీమతి కె. భారతమ్మకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద మంజూరైన రూ.5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) చెక్కును ఎస్పీ తన కార్యాలయంలో అందజేశారు.
    ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్నారని, అలాంటి పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమాన్ని ప్రభుత్వం, పోలీసు శాఖ అత్యంత బాధ్యతగా భావిస్తోందన్నారు. సేవలో ఉన్నప్పుడు లేదా అనుకోని పరిస్థితుల్లో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, బీమా సౌకర్యాలు, ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
    మరణించిన పోలీసు కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీసు శాఖ అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని, అవసరమైన సంక్షేమ ప్రయోజనాలను త్వరితగతిన అందించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుబడి ఉందని ఎస్పీ పేర్కొన్నారు.
    ఈ సందర్భంగా దివంగత ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ కె. బాల నర్సింహులు గారి సేవలను ఎస్పీ స్మరించుకుని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం శ్రీమతి కె. భారతమ్మ చెక్కును స్వీకరించి, ప్రభుత్వం మరియు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
    ఈ కార్యక్రమంలో RI విజయ్ భాస్కర్, DPO సూపర్డెంట్ శ్యాంసుందర్ రాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.