Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పరిమితి మించితేనే..

    Author VENKATESH | 24 Jul 2026, 11:45 AM | HEALTH
    పరిమితి మించితేనే..

    ‘పామాయిల్‌’ మాట వినిపించగానే చాలామంది విష తుల్యంగా భావించి దాంతో చేసిన ఆహారాన్ని వెంటనే పక్కన పెట్టేస్తున్నారు. అంతలా ప్రభావితం చేశారు మరి నేటి సోషల్‌మీడియా సైంటిస్టులు. అయితే సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒక నూనె ఆరోగ్యకరమా కాదా అనేది నూనె పేరును చూసి కాకుండా.. దాన్ని ఎలా వాడుతున్నాం, ఎంత మోతాదులో తీసుకుంటున్నాం.. ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు.
    పామాయిల్‌ విటమిన్‌-ఇ తోపాటు శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. అలా అని పరిమితికి మించి తీసుకోమని కాదు. అన్ని రకాల నూనెలను మారుస్తూ, పరిమిత మోతాదులో వాడటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక రకమైన నూనెను మంచిదని, మరోదాన్ని చెడ్డదని ముద్ర వేయడం శాస్త్రీయంగా సరైన విధానం కాదని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన సమతుల ఆహారం, తక్కువగా వేయించిన పదార్థాలు, నూనెను నియంత్రించి వాడటమే ఆరోగ్యానికి అసలు మంత్రం అని గుర్తుచేస్తున్నారు.