Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాలుష్య కాటు.. కాలేయానికి చేటు

    Author VENKATESH | 28 Jul 2026, 01:32 PM | HEALTH
    కాలుష్య కాటు.. కాలేయానికి చేటు

    కాలేయాన్ని పీల్చి పిప్పి చేసే అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌ ‘హెపటైటిస్‌’. ప్రారంభంలోనే దీనిని గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. శరీరంలోకి ప్రవేశించినా ఎలాంటి లక్షణాలు చూపించకుండా లోలోపలే కాలేయాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి వైద్యులు దీనిని ‘సైలెంట్‌ కిల్లర్‌’ అని పిలుస్తారు. ప్రధానంగా హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీ వైరస్‌ ఎక్కువ మందిపై దాడి చేస్తున్నాయి. మన దేశంలో హెపటైటిస్‌-బీతో 3.4 శాతం, హెపటైటిస్-సీతో ఒక శాతం మంది బాధపడుతుండగా.. ఒక శాతం మంది గర్భిణులు కూడా ఈ ఇన్ఫెక్షన్‌ బారినపడుతున్నారు.
    ప్రపంచ వ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు, లివర్‌ క్యాన్సర్‌ కారణంగా ప్రతి ఏటా దాదాపు 13 లక్షల మంది మరణిస్తున్నారు. 2030 నాటికి వైరల్‌ హెపటైటిస్‏ను ప్రజారోగ్య సమస్య జాబితా నుంచి నిర్మూలించడమే లక్ష్యంగా అంతర్జాతీయ చర్యలు కొనసాగుతున్నాయి. హెపటైటిస్-బీ వైర్‌సను కనుగొన్న బ్లంబర్గ్‌ జయంతిని పురస్కరించుకుని జూలై 28న ‘వరల్డ్‌ హెపటైటిస్‌ డే’ నిర్వహిస్తున్నారు.
    వ్యాధి వ్యాపించిన ప్రారంభంలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు ఉండవు. అలసట, ఆకలి మందగించడం, వికారం, కడుపులో అసౌకర్యం వంటి చిన్నచిన్న సమస్యలను చాలామంది సాదాసీదాగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ కామెర్లు, కడుపు ఉబ్బరం, హఠాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు బయటపడేసరికి వ్యాధి ముదిరిపోతుంది.
    ఐదు రకాల ఇన్ఫెక్షన్లు
    హెపటైటిస్-ఏ, బీ, సీ, డీ, ఈ అని ఐదు రకాల ఇన్ఫెక్షన్లు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
    హెపటైటిస్-ఏ, ఈ : ఇవి కలుషిత నీరు, అపరిశుభ్ర ఆహారం ద్వారా సోకుతాయి. కామెర్ల లక్షణాలు కనిపిస్తాయి.
    హెపటైటిస్-బీ, డీ : బాధితుల రక్తం, శరీర ద్రవాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి. రక్తం చుక్కలు ఎండిపోయినా ఈ వైరస్‌ వారం రోజుల పాటు బతికే ఉంటుంది.
    హెపటైటిస్-సీ : సరిగ్గా స్టెరిలైజ్‌ చేయని వైద్య పరికరాలు, ఒకరు వాడిన నీడిల్స్‌ వాడటం వల్ల సోకుతుంది.
    హెపటైటిస్-బీ, సీలను నిర్లక్ష్యం చేేస్త ‘లివర్‌ సిర్రోసి్‌స’కు దారితీస్తుంది.
    ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కాలేయంపై పడుతున్న ఒత్తిడిని ముందే పసిగట్టేందుకు ‘లివర్‌ స్ర్కీనింగ్‌’ చేయించుకోవాలి. లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ ద్వారా కాలేయంలోని ఎంజైమ్‌లు, ప్రొటీన్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఊబకాయం, మధుమేహం, ఫ్యాటీ లివర్‌ ఉన్నవారు, సప్లిమెంట్లు వాడేవారు, కుటుంబంలో లివర్‌ వ్యాధుల చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయించుకోవాలి.
    క్టర్‌ జి.శ్రీనివాస్‏రెడ్డి, సీనియర్‌ క్లినికల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ హెపటాలజిస్టు, స్టార్‌ ఆస్పత్రి
    హెపటైటిస్-బీ నుంచి రక్షణ పొందేందుకు టీకా ఒక సురక్షితమైన ఆయుధం. బిడ్డ పుట్టిన వెంటనే మొదటి టీకా వేయించి, ఆ తర్వాత షెడ్యూల్‌ ప్రకారం అన్ని డోసులు పూర్తి చేయాలి. గతంలో వ్యాక్సిన్‌ తీసుకోని పెద్దలు, డయాలసిస్‌ రోగులు కూడా టీకా వేయించుకోవాలి.