Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కుంకుమపువ్వు అసలైనదో కాదో ఇలా తెలుసుకోండి.!

    Author VENKATESH | 28 Jul 2026, 02:56 PM | HEALTH
    కుంకుమపువ్వు అసలైనదో కాదో ఇలా తెలుసుకోండి.!

    కుంకుమపువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసుల్లో ఒకటి. దీనిని వంటల్లో, ఆయుర్వేద ఔషధాల్లో, సౌందర్య సాధనాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నందున చాలామంది దీనిని వినియోగిస్తుంటారు. అయితే అధిక ధర కారణంగా మార్కెట్లో నకిలీ కుంకుమపువ్వు కూడా ఎక్కువగా అమ్ముడవుతోంది. నకిలీ కుంకుమపువ్వు ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంది. అందుకే కుంకుమపువ్వు వాడే ముందు ఇలా పరిశీలించి చూడటం మంచిది.
    నీటిలో లేదా పాలలో వేసి చూడాలి
    అసలైన కుంకుమపువ్వును నీటిలో లేదా పాలలో వేసినప్పుడు వెంటనే రంగు వదలదు. కొంత సమయం తర్వాత మెల్లగా లేత పసుపు లేదా బంగారు రంగు వస్తుంది. నకిలీ కుంకుమపువ్వు మాత్రం వెంటనే ముదురు ఎరుపు లేదా నారింజ రంగును విడుదల చేస్తుంది.
    రేకుల ఆకారాన్ని గమనించాలి
    అసలైన కుంకుమపువ్వు రేకులు పలుచగా ఉండి, పై భాగంలో కొద్దిగా వెడల్పుగా, బూర ఆకారంలో కనిపిస్తాయి. నకిలీ కుంకుమపువ్వు రేకులు ఒకేలా, నిటారుగా ఉంటాయి.
    వాసన చూసి గుర్తించాలి
    నిజమైన కుంకుమపువ్వుకు తేలికపాటి తియ్యటి, సహజమైన సువాసన ఉంటుంది. నకిలీ కుంకుమపువ్వుకు మాత్రం ఘాటైన లేదా కృత్రిమ సువాసన వస్తుంది.
    రుచి ద్వారా పరీక్షించాలి
    ఒక రేకును నాలుకపై ఉంచి చూడండి. అసలైన కుంకుమపువ్వు రుచి స్వల్పంగా చేదుగా, వగరుగా ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత శరీరంలో వెచ్చదనం అనిపించవచ్చు. తీపిగా లేదా పుల్లగా అనిపిస్తే అది నకిలీ అయ్యే అవకాశం ఉంది. అలాగే నకిలీ కుంకుమపువ్వు నాలుకపై ఉంచిన వెంటనే రంగు వదలడం ప్రారంభిస్తుంది.
    చేతితో రుద్ది చూడాలి
    ఒక కుంకుమపువ్వు రేకును చేతితో మెల్లగా రుద్ది చూడాలి. అసలైనది చాలా సున్నితంగా ఉండి సులభంగా విరిగిపోతుంది. నకిలీ కుంకుమపువ్వు మాత్రం అంత తేలికగా విరగదు.