Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాజ్యం..

    Author VENKATESH | 28 Jul 2026, 04:49 PM | BUSINESS
    జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాజ్యం..

    ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (Johnson and Johnson) బేబీ టాల్కమ్‌ పౌడర్‌ ఉత్పత్తిపై 15 ఏండ్లుగా కోర్టులో వ్యాజ్యం నడుస్తుంది. కేసులు వేసిన బాధితులకు పరిహారం చెల్లించేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. దీంతో సుమారు 76,000 మందికి దాదాపు 5.5 బిలియన్‌ డాలర్ల (రూ. 52,663 కోట్లు) పరిహారం ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడించింది. 95 శాతం మంది అంగీకరిస్తే దశాబ్దాల పోరాటానికి తెరపడే అవకాశం ఉంది.
    ఏమిటీ ఈ వ్యాజ్యం
    యునైటెడ్‌ స్టేట్స్‌ (US)లో ఈ కంపెనీకి చెందిన బేబీ పౌడర్‌ను వాడటం వల్ల అండాశయ క్యాన్సర్‌ (Ovarian Cancer) వచ్చిందని ఆరోపిస్తూ వేలమంది వినియోగదారులు 15 ఏండ్ల క్రితం కోర్టులో కేసు వేశారు. దీనిలో క్యాన్సర్‌కు కారకమైన ‘ఆస్బెస్టాస్‌’ రసాయనం ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నా ఏండ్ల తరబడి సాగుతున్న కేసుకు ముగింపు చెప్పాలనే పరిహారం చెల్లించేందుకు ముందుకు వచ్చామని కంపెనీ వెల్లడించింది. ఈ కేసుపై ఇంకా ముందకువెళితే గెలుస్తామన్న నమ్మకం ఉంది. కానీ ప్రాణాలు కాపాడే మందులు, పరికరాలను రూపొందించాలనే లక్ష్యంతో ముందుకెళ్లేందుకు దీనికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నామని పేర్కొంది.