Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓ మనిషి

    Author VENKATESH | 28 Jul 2026, 07:50 PM | హైదరాబాద్
    ఓ మనిషి

    ఆత్మవిశ్వాసమే నీవిజయం
    ఓమనిషి నిన్ను నువ్వు
    గౌరవించుకో నీలోని శక్తిని
    నువ్వు గుర్తుంచుకో
    ఎవరో వస్తారని ఏదో
    చేస్తారని ఎదురు చూసి
    మోసం పోకు
    నీనీడను చూసి నీవు
    వెనుకడుగు వేయకు
    ఓటమి ఎదురైనా
    గుండె ధైర్యం వీడకు
    కష్టాల కడలిలో
    కన్నీరు కార్చకు
    నీ ఆత్మ గౌరవమే నీఆయుధం
    నీకృషి సంకల్పం పట్టుదలే
    నిన్ను విజయ తీరాలకు
    చేర్చుతుంది
    సమాజం చూపే అవహేళనలను
    నీవు లెక్కచేయకు నీఆత్మ
    విశ్వాసాన్ని ఎన్నడు కోల్పోకు
    నిన్నటి చెడు జ్ఞాపకాలను వదిలేయ్
    నేటి కొత్త రోజు నీకోసమే అనుకో ఎవరు నిన్ను తక్కువ చేసిన కుంగిపోకు
    నీగొప్పతనాన్ని మాటల్లో
    కాక చేతల్లో చూపించు
    తప్పులు జరుగుతే నేర్చుకో
    గుణపాఠం అనుభవంతో
    తీర్చుకో భవిష్యతు జీవితాన్ని
    సరిదిద్దుకుంటూ సాగించు
    నీ జీవనప్రయాణం
    సహాయం కోసం ఎవరిపైనా
    ఆధారపడకుకు నీకాళ్ళపై
    నీవు నిలబడేలా బలాన్ని
    పెంచుకో
    లక్ష్యం వైపు అడుగులు వేయు
    నీ గమ్యాన్ని ముద్దాడే వరకు
    విశ్రమించకు పట్టుదలే పెట్టుబడి
    కావాలి
    సరికొత్తగా నీస్థాయి పెంచుకో
    లోకం మెచ్చేలా నీవిలువలు
    పెంచుకో
    ఎవరికోసమో నీవిలువను తగ్గించుకో నిన్ను నీవు నమ్మినప్పుడే ఈప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. నీ కష్టమే
    నీకు గుర్తింపు తెస్తుంది.
    నీఆత్మవిశ్వాసమే నిన్ను
    ఉన్నత శిఖరాల వైపు
    నడిపిస్తుంది
    ఉరకలువేసే ఉత్సాహం
    ఉల్లాసం నీ ఊపిరైతే
    ప్రగతి పురోగతి నీ సొంతమవుతుంది
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ
    ఎకనామిక్ ఫోరం
    హైదరాబాద్9440245771