Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బతుకును బలిచేయకు

    Author VENKATESH | 28 Jul 2026, 07:55 PM | కరీంనగర్
    బతుకును బలిచేయకు

    జీవితం విలువైనది
    క్షణికావేశానికి గురికావధ్దు
    బంగారం లాంటి బతుకును
    బలి చేయకు
    గెలుపు ఓటములు
    పొగడ్తలు తెగడ్తలు
    ఆకాశంలో తెప్పల్లాంటివి
    చీకటి వెలుగులు ప్రకృతి సహజం
    సమస్యలకు భయపడకు
    ధైర్యంతో ఎదురుకో
    సహనాన్ని పెంచుకో
    శోధించి సాధించాలి
    సంకల్పమే నీ ఆయుధం
    మనసు మాయలో భంథీవి కాకు
    ఒంటరి తనం వద్దు కలిమిడియే ముద్దు
    గతాన్ని తలవకు వర్ధమానాన్ని మరువకు
    పోలికత్వంలో కూరుకు పోకు
    బతుకు కన్నీటి దారలలోనే
    భలిచేయకు
    ఆశయే నీ ఆభరణమైతే
    ఆందోళన మాయమౌనులే
    మనసు మబ్బుల్లో
    ఒత్తిడి జల్లుల్లో
    తడిసి ముద్దవుతే
    పలకరింపు నీ ఆయుథమైతె
    ఆత్మవిశ్వాసమే నీ భరోసా భద్రత అవుతది
    నిర్మలత్వం నీ ధరి చేరేను
    ఆందోళన అంతరించేను
    ఆనందం అవతరించేను
    కుంగు బాటు తో కుదేలు గాకు
    ఉల్లాసం ఉత్సాహం నీ జీవన
    శైలి అవుతే
    సంతోషం సంతృప్తి నీ ఆస్తులు అవుతాయి
    సానుకూలతను పెంచుకో
    సంతోషాలను పంచుకో
    వ్యక్తిత్వ వికాసం పుస్తక పఠనం
    సజ్జన సాంగత్యం సమాజ సేవ
    ఆధ్యాత్మిక చింతన చెంతన చేరిపో
    ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో
    మానసిక ఆరోగ్యాన్ని రక్షిధ్దాం
    ఆత్మహత్యలు అరికడుతాం
    ఆత్మహత్యలు వద్దు
    ఆరోగ్యకరమైన జీవనమే ముద్దు
    కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణ తో
    ఆత్మీయత అనురాగం బంధాలు అనుబంధాల పూతోటలో
    మమత మానవీయతను పరిమళింప చేద్దాం
    మనో ధైర్యం అనే ఆయుధంతో ఆత్మహత్యలను అరికడుదాం
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
    కరీంనగర్9440245771