Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఘనంగా యువతి సమ్మేళనం

    Author VENKATESH | 29 Jul 2026, 07:24 PM | నల్గొండ
    ఘనంగా యువతి సమ్మేళనం

    దేవరకొండ 29జూలై (BVK 3 న్యూస్ ) :నేరడుగొమ్ము మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాలలో గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్,సెంటర్ ఫర్ వరల్డ్ సోలిడారిటీ (సిడబ్ల్యూఎస్)ఆధ్వర్యం లో యువతి సమ్మేళనం ప్రోగ్రాం స్కూల్ సిబ్బంది సహకారంతో నిర్వహించారు.పాఠశాల ఆవరణలో తొమ్మిది స్టాలను ఏర్పాటు చేశారు.విద్యార్థులందరూ ఆ స్టాలను సందర్శించి అవగాహన పెంచుకున్నారు.పర్యావరణం -పరిరక్షణ,రాజ్యాంగ హక్కులు,సైబర్ భద్రత, బాల్యవివాహాలు,లైంగిక వేధింపులు,ఆరోగ్య-పౌష్టికాహారం,నాయకత్వం, నెలసరి అవగాహన, రంగుల సందడి మొదలగు స్టాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు చూపించారు. విద్యార్థినిలు ఆటపాటలతో అలరించారు.అనంతరం సభ ఏర్పాటు చేసి వాటి యొక్క లాభనష్టాలు గూర్చి వివరించారు.ఈ క్రింది విషయాలను గూర్చి మాట్లాడారు. అందరూ పర్యావరణాన్ని పరీక్షించాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకోవాలన్నారు.సైబర్ భద్రతపై అవగాహన పెంచుకోవాలన్నారు.బాల్య వివాహాలను నిర్మూలించాలని తెలిపారు.లైంగిక వేధింపులకు గురి అయిన వారు తల్లిదండ్రులకు గాని నమ్మకమైన వారికి చెప్పాలన్నారు.సరైన పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. నాయకత్వ లక్షణాలతో ఒక వ్యవస్థను నడిపించవచ్చని అన్నారు.నెలసరి పై అవగాహన కల్పించారు. రంగుల సందడి చిత్రలేఖనంలో ప్రావీణ్యం సాధించవచ్చని తెలిపారు.హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకోవడం నేరం యువత ఇలాంటి వ్యసనాలకు బానిస కావొద్దని చెప్పారు. జెడ్పిహెచ్ఎస్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ 1993 లో గ్రామ్య రిసోర్స్ సెంటర్ ని డాక్టర్ రుక్మిణి రావు స్థాపించారని తెలిపారు.ఏమి వస్తుందని ఆశించి ఆలోచన చేసే ఈ రోజుల్లో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి చాలామందిని చైతన్యపరిచి 2014లో ఉమెన్ ఆఫ్ ది అవార్డు తీసుకున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలను చైతన్య పరచడానికి ఏర్పాటు చేసి విజయవంతంగా ముందుకు పోతున్నారని అన్నారు.టీనేజ్ లో ఉన్న విద్యార్థిని,విద్యార్థులు ఫోన్ అనే వ్యసనానికి బానిస కావద్దని అన్నారు.ఫోన్ ను పక్కకు పెట్టి చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు.కసి ఉంటే మనుషులు దేవుళ్లవుతారని తెలిపారు.బాల్యవివాహాలు చేసుకుంటే ఫోక్సో చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ లాలునాయక్ మాట్లాడుతూ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం వలన పిల్లల్లో అవగాహన పెంపొందుతుందన్నారు. ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు గ్రామ్య, సిడబ్ల్యూఎస్ సొసైటీకి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎలాంటి బాల్యవివాహాలు జరిగిన మా నుండి సమాచారం తెలుపుతామని అన్నారు.గ్రామ్య వ్యవస్థాపకులు డాక్టర్ రుక్మిణి రావు మాట్లాడుతూ ఈ వెనుకబడిన ప్రాంతంలో పసిపిల్లల అమ్మకాలు, బాల్య వివాహాల నిర్మూలన కోసం మా టీం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.ఈ యువతి సమ్మేళనం ప్రోగ్రాం విజయవంతం కావడానికి కృషి చేసిన ఇన్చార్జి ప్రిన్సిపాల్ కు, స్కూలు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ్య వ్యవస్థాపకులు డాక్టర్ రుక్మిణి రావు,ఆదర్శ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ లాలునాయక్, జెడ్పిహెచ్ఎస్ వాసుదేవారెడ్డి, యుగంధర్ రెడ్డి,స్థానిక సర్పంచ్ పులికంటి సుధాకర్,ఉపసర్పంచ్ ఎలిజర్ల శ్రీను,గ్రామ్య డైరెక్టర్ సుమలత, అంగన్వాడి టీచర్ నిరంజనమ్మ,గ్రామ్య వాలంటీర్ మీనా కుమారి,పోలీస్ సిబ్బంది స్వాతి,శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల అధ్యాపక బృందం,గ్రామ్య సిబ్బంది,వాలంటీర్లు విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.