Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రజనీకాంత్ నుంచి రాశీ ఖన్నాకు స్పెషల్ గిఫ్ట్..

    Author VENKATESH | 01 Aug 2026, 12:25 PM | Cinema
     రజనీకాంత్ నుంచి రాశీ ఖన్నాకు స్పెషల్ గిఫ్ట్..

    సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించే అవకాశం రావడం ఏ నటుడికైనా, నటికైనా ప్రత్యేకమైన అనుభవమే. అలాంటి అవకాశం దక్కిన హీరోయిన్ రాశీ ఖన్నాకు షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే తలైవా నుంచి ఊహించని బహుమతి అందింది. రజనీకాంత్ స్వయంగా ఓ ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆమెకు కానుకగా ఇవ్వడంతో రాశీ ఖన్నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ చిత్రంలో రాశీ ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా ఇద్దరి మధ్య ఆధ్యాత్మికత, జీవన విలువలపై ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది.ఆ సమయంలో రజనీకాంత్ ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథం ‘Living with the Himalayan Masters’ గురించి ప్రస్తావించారు. తాను ఇప్పటివరకు ఆ పుస్తకాన్ని చదవలేదని రాశీ చెప్పగా, రెండు రోజుల వ్యవధిలోనే ఆ పుస్తకాన్ని తెప్పించి స్వయంగా ఆమెకు బహుమతిగా అందించినట్లు సమాచారం.రజనీకాంత్ నుంచి ఈ ప్రత్యేక కానుక అందుకోవడంపై రాశీ ఖన్నా సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు.ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు… నా జీవితానికి ఒక నిశ్శబ్దమైన మార్గదర్శకం అంటూ ఆమె పేర్కొన్నారు. కొన్నిసార్లు పరిణతి అంటే కొత్తగా ఏదైనా సాధించడం కాదు.. మనం కాని వ్యక్తిగా నటించడం మానేసి, మన నిజమైన స్వరూపాన్ని అంగీకరించడం అనే భావాన్ని ప్రతిబింబించే కోట్‌ను కూడా ఆమె షేర్ చేశారు. స్తకం పూర్తిగా చదివానో లేదో తర్వాత పరీక్ష పెడతానని రజనీ సార్ చెప్పారు. అందుకే చాలా శ్రద్ధగా చదువుతున్నాను అంటూ అభిమానులతో ఆ అనుభవాన్ని పంచుకున్నారు.