Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆధ్యాత్మిక గురువుతో ప్రేమ‌లో ప‌డ్డ‌ హీరోయిన్ మృణాళిని రవి..

    Author VENKATESH | 02 Aug 2026, 11:52 AM | Cinema
    ఆధ్యాత్మిక గురువుతో ప్రేమ‌లో ప‌డ్డ‌ హీరోయిన్ మృణాళిని రవి..

    దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మృణాళిని రవి త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది. మలేసియాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మహావిష్ణుతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించిన మృణాళిని, కాబోయే భర్తతో కలిసి దిగిన అందమైన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొత్త జీవితానికి శ్రీకారం చుట్టబోతున్న ఈ జంటకు నెటిజన్లు కూడా అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
    సమాచారం ప్రకారం, మృణాళిని రవి మరియు మహావిష్ణు గత ఏడేళ్లుగా మంచి స్నేహితులుగా ఉన్నారు. కాలక్రమంలో ఆ స్నేహం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి బంధంగా రూపాంతరం చెందుతోంది. అయితే వివాహం ఎప్పుడు, ఎక్కడ జరగనుందనే విషయాలను మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. త్వరలోనే పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మృణాళిని రవి సినీ ప్రయాణం విషయానికి వస్తే.. 2019లో విడుదలైన ‘సూపర్ డీలక్స్’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా అరంగేట్రం చేసింది. అనంతరం ‘ఛాంపియన్’, ‘ఎనిమీ’, ‘ఎంజీఆర్ మగన్’, ‘జాంగో’, ‘కోబ్రా’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది.