Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వైన్ తాగే వారిలో ర‌క్త‌నాళాల్లో త‌గ్గిన కొవ్వు నిల్వ‌లు..

    Author VENKATESH | 11 Aug 2026, 09:28 PM | HEALTH
    వైన్ తాగే వారిలో ర‌క్త‌నాళాల్లో త‌గ్గిన కొవ్వు నిల్వ‌లు..

    మధుమేహంతో బాధపడుతున్నవారిలో గుండె సంబంధిత సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో కొవ్వు, ఇతర పదార్థాలు పేరుకుపోయి ప్లాక్‌ ఏర్పడటం వల్ల రక్తప్రసరణకు ఆటంకం కలుగుంది. అయితే వైన్‌ను పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల కొంతమంది మధుమేహుల్లో రక్తనాళాల్లో పేరుకుపోయిన ప్లాక్‌ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనం సూచించింది. యురోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో, రక్తనాళాల్లో ఇప్పటికే ప్లాక్‌ ఉన్న మధుమేహ బాధితులను పరిశీలించారు. అధ్యయనం ప్రారంభంలో రక్తనాళాల్లో ఎక్కువగా ప్లాక్‌ ఉన్నవారిలో, రెండు సంవత్సరాల తర్వాత ఈ పేరుకుపోయిన పదార్థాల్లో స్వల్పమైనప్పటికీ గణనీయమైన తగ్గుదల కనిపించింది.
    2 ఏళ్ల త‌రువాత తేడాలు..
    అయితే రెండు సంవత్సరాల తర్వాత అల్ట్రాసౌండ్‌ పరీక్షల్లో పాల్గొన్నవారి రక్తనాళాల్లో ప్లాక్‌ గణనీయంగా పెరిగినట్లు కనిపించలేదు. వారు వైన్‌ తీసుకున్నా, తీసుకోకపోయినా ఈ విషయంలో పెద్దగా తేడా కనిపించలేదు. అయితే అధ్యయనం ప్రారంభంలో రక్తనాళాల్లో ఎక్కువ మొత్తంలో ప్లాక్‌ ఉన్నవారిలో మాత్రం అధ్యయనం ముగిసే సమయానికి ఈ నిక్షేపాలు కొంత తగ్గినట్లు గుర్తించారు. మధుమేహంతోపాటు రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి కార్డియో-మెటబాలిక్‌ సమస్యలు గుండె జబ్బులు, స్ట్రోక్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశాన్ని పెంచుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. రక్తనాళాల్లో ప్లాక్‌ పేరుకుపోవడం కూడా ఇలాంటి ప్రమాద కారకాలలో ఒకటిగా ఉంటుంది. గతంలో నిర్వహించిన కొన్ని పరిశోధనలు కూడా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు వైన్‌ను పరిమితంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని సూచించాయి. అయితే దీనిని వైన్‌ తాగడం ఆరోగ్యానికి తప్పనిసరిగా మంచిదనే అర్థంలో తీసుకోకూడదు.