Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం హత్య..

    Author VENKATESH | 24 Aug 2026, 01:22 PM | INTERNATIONAL
    బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం హత్య..

    బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో హిందూ కుటుంబం దారుణ హత్యకు గురైన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబంలోని నలుగురిని హత్య చేసిన తర్వాత కూడా నిందితులు వెంటనే అక్కడి నుంచి పారిపోలేదు. కొన్ని గంటల పాటు అదే ఇంట్లో ఉండి స్నానం చేసి, ఫ్రిజ్‌లో ఉన్న దోసకాయలు, ఖర్జూరాలు తిన్నారు. అనంతరం అక్కడే మాదకద్రవ్యాలను సేవించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మృతులను రంగ్‌పూర్ జిల్లా పాఠశాల మాజీ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె ఆగామి (23), కుమారుడు ప్రియమ్ (12)గా గుర్తించారు. రంగ్‌పూర్ నగరంలోని దాస్‌పారా ప్రాంతంలోని వారి ఇంట్లో శనివారం రాత్రి సుమారు 11.30 గంటలకు మృతదేహాలను గుర్తించారు. సిద్ధార్థ దాస్, ముగ్ధ దాస్ అనే ఇద్దరు వ్యక్తులు పక్క భవనం మీదుగా గణపతి ఇంటి పైకప్పు పైకి వెళ్లారు. అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. పైకప్పుపై శబ్దాలు విని గణపతి అక్కడికి వెళ్లి వారిని ప్రశ్నించడంతో గొడవ జరిగింది .తమను గుర్తిస్తారనే భయంతో నిందితులు గణపతి గొంతును తువ్వాలతో బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గణపతి అరుపులు విని ఆయన భార్య ప్రీతిలత పైకి వెళ్లగా, ఆమెను కూడా మెట్ల వద్ద గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కుమార్తె ఆగామి, 12 ఏళ్ల కుమారుడు ప్రియమ్‌ను కూడా హత్య చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. గణపతి మృతదేహం పైకప్పుపై, ప్రీతిలత, ఆగామి మృతదేహాలు మెట్ల వద్ద, ప్రియమ్ మృతదేహం ఇంట్లోని మంచం కింద లభించాయి.