Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టాలీవుడ్ లో క్రేజీ ఫిల్మ్: పెద్దమ్మ చూస్తుంది రా..

    Author VENKATESH | 24 Aug 2026, 01:54 PM | Cinema
    టాలీవుడ్ లో క్రేజీ ఫిల్మ్: పెద్దమ్మ చూస్తుంది రా..

    "ఆగస్ట్ 2024- ది ఎండ్ బిగిన్స్" అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ను ప్రకటించారు. శుక్రాచార్యా వార్ క్రై పేరుతో విడుదలైన ఈ వీడియో వైరల్‌ అయింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఇందులో కీలక పాత్ర పోషిస్తోన్నారు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడిగా నటిస్తోన్నారు. ఛావాలో ఔరంగజేబ్, ధురంధర్ లో రెహ్మాన్ డకైట్, బోర్డర్ 2లో లెప్టినెంట్ ధరంవీర్ భక్రి, ఇక్కాలో శౌర్యమాన్ గౌర్ పాత్రలతో దేశవ్యాప్తంగా తన సత్తా నిరూపించుకున్నాడు. ఆయన పోషించిన ఈ క్యారెక్టర్లు లేకపోతే సినిమానే లేదనే రేంజ్ లో గుర్తింపు వచ్చిందాయనకు. Also Read మెగాస్టార్ విధ్వంసం.. రచ్చ లేపుతున్న టైటిల్ గ్లింప్స్! ఇప్పుడు మహాకాళిలో నటిస్తోన్నారు. శుక్రాచార్యుడిగా కీలక పాత్రను పోషిస్తోన్నారు. పురాణాల ప్రకారం అసురుల గురువు శుక్రాచార్యుడు. ఈ క్యారెక్టర్ చుట్టే మహాకాళి కథ తిరుగుతుందనే ప్రచారం ఉంది. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. గుర్తు పట్టని విధంగా తనను తాను మలచుకున్నారు. ఇతిహాసాలు, పురాణాల ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతోందీ మహాకాళి ఫిల్మ్. స్టార్ యాక్టర్ కటౌట్ కు తగ్గ గెటప్: టాలీవుడ్ లో నెక్స్ట్ లెవెల్ మైథలాజికల్ థ్రిల్లర్ ఈ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దీనికి మూలకథను అందిస్తోన్నారు. సినిమాటిక్ విశ్వాన్ని క్రమంగా విస్తరిస్తోన్నారు. ఆర్ కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కబోతోంది. రివాజ్ రమేశ్ దుగ్గల్ ఈ పౌరాణిక యాక్షన్ అడ్వెంచర్ సినిమాను నిర్మిస్తున్నారు. హనుమాన్ తరహాలోనే సరికొత్త సాంకేతికత, అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రం రూపొందుతోంది.