Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇరాన్‌పై అత్యంత తీవ్ర‌మైన ఆర్థిక‌ ఆంక్షలు విధించిన అమెరికా..

    Author VENKATESH | 25 Aug 2026, 11:33 AM | INTERNATIONAL
    ఇరాన్‌పై అత్యంత తీవ్ర‌మైన ఆర్థిక‌ ఆంక్షలు విధించిన అమెరికా..

    ఇరాన్‌పై మొన్న‌టి వ‌ర‌కు భౌతిక దాడుల‌కు పాల్ప‌డిన అమెరికా ఇప్పుడు రూటు మార్చింది. స‌రికొత్త ఆంక్ష‌ల పేరుతో టెహ్రాన్ ఆర్థిక మూలాలను దెబ్బ‌తీయాల‌ని యోచిస్తున్న‌ది. ఇందులో భాగంగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ఇరాన్‌పై చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ప్రకటించారు. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌క్యాస్ట్’ పేరుతో ఈ కొత్త ఆంక్షల ప్యాకేజీని ప్రకటించారు. ఇరాన్ ఆర్థిక మూలాలను పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. టెహ్రాన్‌పై ఇది ఒక ‘ఆర్థిక డి-డే’ లాంటిదని హెచ్చరించారు. డిజిటల్ ఆస్తులు, టెక్నాలజీ, బంగారం, విమానయానం, నౌకా రవాణా వంటి కీలక రంగాలను ఈ ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చారు. ఇరాన్‌తో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలపై కూడా ద్వితీయ స్థాయి ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.దీంతో పాటు ఇరాన్ చమురు ఆదాయం, ఆయుధాల సేకరణ, సైబర్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న 60కి పైగా వ్యక్తులు, కంపెనీలు, నౌకలపై కూడా ఆంక్షలు విధించారు. ఇరాన్‌తో ఆర్థిక పోరులో ఇది చివరి అంకమని అమెరికా ప్రకటించింది. ఇరాన్‌తో సంబంధాలు తెంచుకోవాలని ప్రపంచ దేశాల నాయకులను కోరారు. మీరు మా వైపు ఉంటారా లేక మాకు వ్యతిరేకంగా ఉంటారా” అని అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే ఇరాన్‌కు మద్దతు ఇస్తున్న సుమారు 60 సంస్థలు, విదేశీ నౌకలపై అమెరికా నిఘా పెట్టింది. సహకరించే ఇతర దేశాలకూ ఆంక్షల భయం ఉంటుందని తెలిపారు. ఇరాన్‌తో ఆర్థికంగా భాగస్వామ్యం వహించే ఏ దేశమైనా ఏకాకిగా మిగిలిపోతుందని బెసెంట్ తెలిపారు. యూఎస్‌ ప్రకటనపై ఇటు ఇరాన్ ప్రభుత్వం కూడా ఘాటుగా స్పందించింది. ట్రంప్ ప్ర‌భుత్వం విధించిన ఆంక్ష‌ల‌ను ఎదుర్కొవ‌డానికి మా వ‌ద్ద రెండేండ్ల ప్ర‌ణాళిక ఉంద‌ని, ప్ర‌తీకార దాడులు త‌ప్ప‌వ‌ని బ‌దులిచ్చింది.