Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బ‌రువు త‌గ్గేందుకు ఎలాంటి ఆహారాల‌ను తినాలి..

    Author VENKATESH | 27 Aug 2026, 02:11 PM | HEALTH
    బ‌రువు త‌గ్గేందుకు ఎలాంటి ఆహారాల‌ను తినాలి..

    బరువు తగ్గేందుకు చాలామంది కేలరీలను లెక్కించడం, ఆహారం పరిమాణాన్ని తగ్గించడం, ఆకలిని నియంత్రించడం వంటి పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే వీటికి భిన్నంగా ఆహారంలో ఎలాంటి పదార్థాలను ఎంచుకుంటున్నామన్నదే కీలకమని తాజా అధ్యయనం సూచిస్తోంది. తక్కువ కొవ్వు, పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం ద్వారా కేలరీలను ప్రత్యేకంగా లెక్కించాల్సిన అవసరం లేకుండానే వాటి వినియోగాన్ని తగ్గించుకోవడంతో పాటు బరువును నియంత్రించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 16 వారాల పాటు సాగిన క్లినికల్ ట్రయల్‌లో అధిక బరువు ఉన్న పెద్దలను పరిశీలించారు. ఇందులో ఒక వర్గానికి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పుధాన్యాలపై ఆధారపడిన తక్కువ కొవ్వు శాకాహార ఆహారాన్ని అందించారు. మరో వర్గం తమ సాధారణ ఆహారపు అలవాట్లను కొనసాగించింది. ముఖ్యంగా ఏ వర్గానికీ కేలరీల పరిమితిని విధించలేదు. ఎంత ఆహారం తినాలో కూడా నిర్దేశించలేదు.
    శాకాహారం తింటే..
    అధ్యయనంలో తక్కువ కొవ్వు శాకాహార ఆహారం తీసుకున్నవారు రోజుకు సగటున 357 కేలరీలు తక్కువగా తీసుకున్నట్లు గుర్తించారు. అయినప్పటికీ వారు తినే ఆహారం మొత్తం బరువులో గణనీయమైన మార్పు కనిపించలేదు. అంటే ఆహారం పరిమాణం పెద్దగా తగ్గించకుండానే కేలరీల వినియోగం తగ్గింది. దీనికి ప్రధాన కారణం ఎనర్జీ డెన్సిటీ అని పరిశోధకులు పేర్కొన్నారు. అంటే ఒక గ్రాము ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయన్నది. కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాల్లో నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వాటిలో ప్రతి గ్రాముకు ఉండే కేలరీలు సాధారణంగా తక్కువగా ఉంటాయి. దీంతో కడుపు నిండేంత ఆహారం తీసుకున్నప్పటికీ మొత్తం కేలరీల వినియోగం తక్కువగా ఉంటుంది. అధ్యయనం ప్రకారం శాకాహార ఆహారం తీసుకున్నవారి ఆహారంలో ఎనర్జీ డెన్సిటీ సుమారు 30 శాతం తగ్గింది. ఎనర్జీ డెన్సిటీ ఎంత ఎక్కువగా తగ్గిందో, అంత ఎక్కువ బరువు తగ్గుదలతో సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కేలరీల వినియోగంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా ఈ సంబంధం కొనసాగింది.
    ఆక‌లి, తృప్తిపై ప్ర‌భావం..
    శాకాహార ఆహారంలో మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి అధిక కేలరీల సాంద్రత కలిగిన జంతు ఆధారిత ఆహారాలను తగ్గించి, కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ కేలరీలు కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకున్నారు. వీటిలో నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ కేలరీలతోనే ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆహారంలోని ఎనర్జీ డెన్సిటీ మన ఆకలి, తృప్తిపై కూడా ప్రభావం చూపిస్తుంది. తక్కువ ఎనర్జీ డెన్సిటీ కలిగిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు శరీరంలోని సహజమైన ఆకలి నియంత్రణ సంకేతాలు మనకు అనుకూలంగా పనిచేస్తాయ‌ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఫలితంగా కడుపు నిండిన భావన కలిగినప్పటికీ మొత్తం కేలరీల వినియోగం తగ్గుతుంది. బరువు తగ్గేందుకు సాధారణంగా చిన్న పరిమాణాల్లో తినాలని, కేలరీలను కచ్చితంగా లెక్కించాలని సూచిస్తుంటారు. అయితే ఈ అధ్యయనం ఆహారం పరిమాణాన్ని తగ్గించడం కంటే, ప్లేట్‌లో ఉండే ఆహారాల స్వభావాన్ని మార్చడం మరో మార్గంగా ఉంటుంద‌ని సూచిస్తోంది. నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండే మొక్కల ఆధారిత ఆహారాలను ఎంచుకోవడం ద్వారా తృప్తిగా తింటూనే కేలరీల వినియోగాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.