Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫోర్బ్స్ షోస్టాపర్స్‌లో టాలీవుడ్ జోరు.. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌కు చోటు..

    Author VENKATESH | 27 Aug 2026, 02:48 PM | Cinema
    ఫోర్బ్స్ షోస్టాపర్స్‌లో టాలీవుడ్ జోరు.. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌కు చోటు..

    టాలీవుడ్‌ స్టార్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ జాతీయ స్థాయిలో సత్తాచాటారు. ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన షోస్టాపర్స్ 2026 జాబితాలో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా వినోదం, క్రీడలు, పాపులర్ కల్చర్‌కు చెందిన 100 మంది ప్రముఖులతో రూపొందించిన ఈ జాబితాలో ఉన్న ఏకైక తెలుగు సినీ తారలు వీరిద్దరే కావడం విశేషం.
    కవర్‌ పేజీపై అల్లు అర్జున్..
    ‘పుష్ప 2: ది రూల్’తో దేశవ్యాప్తంగా తన క్రేజ్‌ను మరింత పెంచుకున్న అల్లు అర్జున్‌కు ఈసారి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫోర్బ్స్ ఇండియా ‘షోస్టాపర్స్ 2026’ ఎడిషన్‌ కవర్‌పై ఆయన మెరిశారు. పుష్పతో మొదలైన ఆయన పాన్‌ ఇండియా ప్రయాణం.. ‘పుష్ప 2’ విజయంతో మరింత విస్తరించింది. దీంతో తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన స్టార్‌ ఇమేజ్‌ నుంచి జాతీయ స్థాయి స్టార్‌గా అల్లు అర్జున్‌ ఎదిగారు.
    రామ్‌చరణ్‌కూ చోటు..
    మరోవైపు రామ్‌చరణ్‌ కూడా షోస్టాపర్స్ జాబితాలో స్థానం సంపాదించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌లో కీలక భాగమయ్యారు. ప్రస్తుతం ‘పెద్ది’తో పాటు పలు భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో రామ్‌చరణ్‌ సినిమాలపై జాతీయ స్థాయిలోనూ ఆసక్తి నెలకొంది.