Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జీవీ నారాయణరావుకి నివాళులు అర్పించిన‌ చిరంజీవి..

    Author VENKATESH | 28 Aug 2026, 12:16 PM | Cinema
    జీవీ నారాయణరావుకి నివాళులు అర్పించిన‌ చిరంజీవి..

    తెలుగు సినీ, రంగస్థల నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఉంచిన ఆయన పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారాయణరావుతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జీవీ నారాయణరావుతో తనకు 1977 నుంచే పరిచయం ఉందని చిరంజీవి తెలిపారు. తాను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్న రోజుల్లో నారాయణరావు సీనియర్ విద్యార్థిగా తరగతులకు వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి తమ మధ్య స్నేహం మరింత బలపడిందని చెప్పారు.సౌత్ ఏషియన్ కల్చరల్ ఈవెంట్లను కనుగొనడం“నారాయణరావు లేరు అనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయనతో నాకు చాలా సన్నిహితమైన అనుబంధం ఉంది. ఏ పని అనుకున్నా పూర్తి చేసేంత పట్టుదల ఆయనలో ఉండేది. సినీ రంగంపై ఆయనకున్న ప్రేమ, అంకితభావం ఎంతో ప్రత్యేకమైనవి” అని చిరంజీవి పేర్కొన్నారు. ఇటీవలే నారాయణరావు తనను కలిసిన విషయాన్ని కూడా చిరంజీవి గుర్తుచేసుకున్నారు. చాలా కాలం తర్వాత ‘మంచు పల్లకి’ చిత్రానికి స్ఫూర్తితో ఐదుగురు యువకులు, పెద్దవాళ్లుగా మారితే వారి జీవితం ఎలా ఉంటుంది అనే కథతో ఒక సినిమా తెరకెక్కించానని నారాయణరావు తనతో చెప్పారని తెలిపారు. ఆ సినిమా ట్రైలర్ లాంచ్‌కు తన సహకారం కావాలని కోరారని, తప్పకుండా చేస్తానని తాను హామీ ఇచ్చానని చిరంజీవి చెప్పారు