Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బిలియన్ డాలర్ల బ్లాక్‌బస్టర్ ‘మైఖేల్’ ఇక ఓటీటీలో..

    Author VENKATESH | 29 Aug 2026, 11:43 AM | Cinema
    బిలియన్ డాలర్ల బ్లాక్‌బస్టర్ ‘మైఖేల్’ ఇక ఓటీటీలో..

    ఈ ఏడాది హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘మైఖేల్’ ఒకటి. ప్రపంచ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసిన కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ బయోపిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చేసింది. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ టైటిల్ పాత్రలో నటించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తన మామయ్య మైఖేల్ జాక్సన్ పాత్రలో జాఫర్ చూపించిన హావభావాలు, డ్యాన్స్, పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజా నివేదికల ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి అత్యంత విజయవంతమైన బయోపిక్‌లలో ఒకటిగా నిలిచింది.
    థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన తర్వాత ‘మైఖేల్’ డిజిటల్ హక్కులను జియోహాట్‌స్టార్ దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రం ఆగస్టు 29 నుంచి జియోహాట్‌స్టార్‌లోని పీకాక్ హబ్ ద్వారా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.అయితే ప్రస్తుతానికి భారతీయ ప్రేక్షకుల కోసం ఈ సినిమా కేవలం రెండు భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్‌తో పాటు హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. ఇతర భారతీయ భాషల్లో స్ట్రీమింగ్‌పై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. ‘మైఖేల్’ సినిమా మైఖేల్ జాక్సన్ చిన్ననాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా సంగీత సంచలనంగా ఎదిగిన ప్రయాణాన్ని తెరపై చూపిస్తుంది. జాక్సన్ 5 రోజుల నుంచి ఆయన సోలో కెరీర్ ప్రారంభం వరకు, ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రభావశీలమైన కళాకారుడిగా ఎదిగిన పయనాన్ని ఈ బయోపిక్‌లో ప్రధానంగా ఆవిష్కరించారు.