Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రోజూ ఒక టీస్పూన్ పొడి వాడితే చాలు - షుగర్ కంట్రోల్, గుండె సేఫ్..!!

    Author VENKATESH | 31 Aug 2026, 04:16 PM | HEALTH
    రోజూ ఒక టీస్పూన్ పొడి వాడితే చాలు - షుగర్ కంట్రోల్, గుండె సేఫ్..!!

    మునగాకులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. మునగాకు పొడి అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప్రకృతిసిద్ధమైన ఔషధం. మున‌గ ఆకు పొడిని వాడ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ముడ‌త‌లు త‌గ్గిపోతాయి. దీంతో య‌వ్వ‌నంగా క‌నిపి స్తారు. మున‌గాకుల పొడిలో కాస్త రోజ్ వాట‌ర్ క‌లిపి న‌ల్ల‌ని మ‌చ్చ‌లు, మొటిమ‌లు ఉన్న చోట రాసి ఆ తరువాత త‌రువాత క‌డిగేయాలి. ఇలా చేస్తుంటే ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మున‌గాకుల్లో పోష‌కాలు మెండుగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ పొడిని రోజూ తీసుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగు తుంది. ముఖ్యంగా సీజ‌నల్ వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ద‌గ్గు, జ‌లుబు నుంచి త్వ‌రగా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మున‌గాకుల్లో మెగ్నిషియం, ఐర‌న్ స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల ర‌క్తం త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మున‌గాకుల్లో ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ‌శ‌క్తిని పెంచుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను శుభ్రం చేస్తుంది
    మధుమేహ బాధితులకు మేలు .
    అదే విధంగా మధుమేహ బాధితులకు ఈ పొడి వరం లాంటిది. మునగ పొడి డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎక్కువగా తగ్గిస్తుందని అధ్యయనాలు తేల్చాయి . మునగ పొడిలో ఎక్కువగా విటమిన్స్, ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఇతర ముఖ్య బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత, నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, క్యాన్సర్, ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యల్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఈ పొడితో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గిపోతాయి. బీపీ అదుపు లోకి వ‌స్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. చిన్నారుల‌కు సైతం మున‌గా కు పొడిని ఇవ్వ‌వ‌చ్చు. మున‌గాకు పొడిని తిన‌డం కూడా క‌ష్టంగా ఉంటే దాన్ని ఏదైనా ఇతర ప‌దా ర్థంతో క‌లిపి తిన‌వ‌చ్చని... లేదా రోజూ అన్నంలో మొద‌టి ముద్ద‌లో తిన‌వ‌చ్చని సూచిస్తున్నారు. పరిమితి మేరకు వినియోగిస్తే మునగాకు తో ప్రయోజనాలు సొంతం అవుతాయని స్పష్టం చేస్తున్నారు.