Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ‘ఇరుముడి’కి పారితోషికం వద్దని.. థియేట్రికల్ రైట్స్‌తో భారీ జాక్‌పాట్ కొట్టిన రవితేజ!

    Author VENKATESH | 01 Sep 2026, 02:20 PM | Cinema
    ‘ఇరుముడి’కి పారితోషికం వద్దని.. థియేట్రికల్ రైట్స్‌తో భారీ జాక్‌పాట్ కొట్టిన రవితేజ!

    మాస్ మహారాజా రవితేజ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో దూసుకుపోతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో పాటు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం రూ.180 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌గా.. రూ.200 కోట్ల దిశ‌గా దూసుకెళుతూ ర‌వితేజ కెరీర్‌లో మొట్ట‌మొద‌టి రూ.200 కోట్ల సినిమాగా రికార్డు న‌మోదు చేయ‌బోతుంది.అయితే ఈ సినిమాకు సంబంధించి రవితేజ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే రవితేజ, ‘ఇరుముడి’ సినిమాకు మాత్రం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా సినిమా పట్ల ఉన్న నమ్మకంతో ఒక రిస్క్ చేసిన‌ట్లు తెలుస్తుంది.