Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ విమానం మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ..

    Author VENKATESH | 02 Sep 2026, 01:24 PM | INTERNATIONAL
    నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ విమానం మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ..

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియేలో జరిగిన నాటో సదస్సు ముగిసిన తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా రహస్యంగా విమానం మారిన ఉదంతంపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ 'ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్' పేరిట ఓ డాక్యుమెంటరీని నిర్మించింది. ట్రంప్ విమానం మారిన సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఉన్న వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్ జర్నలిస్టులు.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు.. విమాన సిబ్బంది ప్రత్యక్ష అనుభవాలు, ఇంటర్వ్యూలతో నెట్‌ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించింది. ఉత్కంఠభరితమైన నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్' సెప్టెంబర్ 4వ తేదీనుంచి స్ట్రీమింగ్ కానుంది.
    ఇంతకీ ఏం జరిగిందంటే..
    జులై నెలలో నాటో సదస్సు కోసం ట్రంప్ ఖతార్ దేశం బహుమతిగా ఇచ్చిన అత్యాధునిక కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తుర్కియే వెళ్లారు. ఇరాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న తుర్కియేలో కొత్త విమానం భద్రతపై నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా సిబ్బంది రహస్యంగా ఆయనను తుర్కియే నుంచి తరలించేందుకు పక్కా ప్లాన్ వేశారు.