Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ..

    Author VENKATESH | 05 Sep 2026, 11:18 AM | Cinema
    డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ..

    తెలుగు సినీ పరిశ్రమలో కీలకమైన సినీ డాన్సర్స్ అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. యూనియన్ ఆధిపత్యం, అధికారిక గుర్తింపు, బ్యాంకు లావాదేవీలు, నిధుల నిర్వహణ వంటి అంశాలపై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ నేతృత్వంలోని వర్గానికి, సంఘం నాయకురాలు సుమలత ప్యానెల్‌కు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది.రఘు మాస్టర్ నేతృత్వంలోని కమిటీకి చట్టబద్ధమైన అధికారం లేదని సుమలత తన ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం. అసోసియేషన్ బైలాస్ నిబంధనలను పక్కన పెట్టి యూనియన్‌ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వర్గం ఆరోపిస్తోంది. అంతేకాకుండా యూనియన్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, లావాదేవీలను నియంత్రించే ప్రయత్నంలో ఫోర్జరీ సంతకాలు, తప్పుడు రికార్డులు సమర్పించారనే ఆరోపణలను కూడా సుమలత వర్గం చేసింది. అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, చట్టవిరుద్ధంగా నిధులను డ్రా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ రఘు మాస్టర్ ప్యానెల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది.