Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శేఖర్ కమ్ముల హీరోలంటే నాకు న‌చ్చ‌రు

    Author VENKATESH | 09 Sep 2026, 01:15 PM | Cinema
    శేఖర్ కమ్ముల హీరోలంటే నాకు న‌చ్చ‌రు

    టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరోసారి తనదైన శైలిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్’ (Epic). ’90’s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందీప్ వంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.తాజా సినిమాలు చూడండిఈ వేడుకలో భాగంగా ‘ఎపిక్’ టీజర్‌లో ఉన్న ఒక విలక్షణమైన డైలాగ్‌పై ఆసక్తికర చర్చ నడిచింది. చిత్రంలో “ఇది శేఖర్ కమ్ముల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ” అనే డైలాగ్ ఉంది. ఈ సంభాషణపై యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు సందీప్ వంగా తనదైన శైలిలో స్పందించారు.ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను.. నాకు శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలు అసలు నచ్చరు. అయితే, ఆయన చిత్రాల్లోని హీరోయిన్ల పాత్రలు మరియు వారి డిజైనింగ్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. ‘ఎపిక్’ టీజర్‌లో ఈ డైలాగ్ వినడానికి ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. శేఖర్ కమ్ముల హీరో లాంటి అబ్బాయి, నా సినిమాల్లోని హీరో లాంటి అమ్మాయి కలయిక అనే కాన్సెప్ట్ సినిమాపై అంచనాలను పెంచేసింది అని పేర్కొన్నారు. భిన్నమైన ఆలోచనాధోరణి, విభిన్నమైన క్యారెక్టరైజేషన్లతో టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శేఖ‌ర్ కమ్ముల‌పై సందీప్ వంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, నెట్టింటనూ హాట్ టాపిక్‌గా నిలిచాయి.