Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ‘మండాడి’ ఘనవిజయంపై కృతజ్ఞతలు తెలిపిన సూరి, సుహాస్!

    Author VENKATESH | 12 Sep 2026, 08:17 PM | Cinema
    ‘మండాడి’ ఘనవిజయంపై కృతజ్ఞతలు తెలిపిన సూరి, సుహాస్!

    ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై దర్శకుడు మదిమారన్ పుగళేంది అద్భుతమైన కంటెంట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విలక్షణమైన చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ద్వారా సెప్టెంబర్ 10న ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేశారు. చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడమే కాకుండా, రోజురోజుకూ కలెక్షన్ల పరంగా అద్భుతమైన జోరును ప్రదర్శిస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష ఆదరణను పురస్కరించుకుని చిత్ర బృందం శనివారం నాడు హైదరాబాద్‌లో ‘యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్’ వేడుకను ఎంతో వైభవంగా నిర్వహించింది. ఈ విజయోత్సవ సభలో పాల్గొన్న చిత్ర యూనిట్ సభ్యులు ఈ సక్సెస్‌పై తమ తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
    ఈ కార్యక్రమంలో కథానాయకుడు సూరి మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని, ‘మండాడి’ చిత్రాన్ని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు వారికి శతకోటి వందనాలు అని అన్నారు. మైత్రి సంస్థకు చెందిన నవీన్, రవి గారలు సినిమా విడుదలకు రెండు రోజుల ముందే డిస్ట్రిబ్యూషన్ ప్రింట్ చూసి ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని భరోసా ఇచ్చారని, వారి నమ్మకం ఈ రోజు నిజమైందని తెలిపారు. ఈ పయనం లో తనతో పాటు ప్రయాణించిన సహనటుడు, తమ్ముడు సుహాస్‌కు, అలాగే తమిళంతో పాటు తెలుగులోనూ ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ సూరి కృతజ్ఞతలు తెలిపారు.
    మరో కథానాయకుడు సుహాస్ మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించడం ఎంతో గర్వంగా ఉందన్న భావనను వ్యక్తం చేశారు. సూరి అన్నతో కలిసి నటించడం గొప్ప అనుభవమని, షూటింగ్ సమయంలో పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్స్ నవీన్ గారు సినిమా చూసిన వెంటనే థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమని చెప్పారని గుర్తుచేసుకున్నారు. మహిమా నంబియార్, రవీంద్ర విజయ్ ల పాత్రలతో పాటు చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంతో ఆస్వాదిస్తున్నారని, ఈ ప్రాజెక్ట్‌లో అవకాశం ఇచ్చిన దర్శకుడు మదిమారన్, నిర్మాత ఎల్రెడ్ కుమార్‌లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
    మైత్రి సంస్థ ప్రతినిధులు నవీన్, రవి, శశి గారలు మాట్లాడుతూ, ఈ సినిమా బిజినెస్ కట్ ఎనిమిది నెలల క్రితమే చూసి హక్కులను దక్కించుకున్నామని, తాము పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారని హర్షం వ్యక్తం చేశారు. క్లైమాక్స్ బోట్ సీక్వెన్స్, సూరి-సుహాస్‌ల నటన థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, తొలి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు మరింత పెరిగాయని వివరించారు. డిమాండ్‌కు అనుగుణంగా మూడో రోజు దాదాపు వంద స్క్రీన్లను పెంచామని, పంపిణీదారులు అందరూ ఎంతో లాభాలతో సంతోషంగా ఉన్నారని వెల్లడించారు.