Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సర్వారం తండాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..!

    Author VENKATESH | 18 Sep 2026, 08:47 PM | ఖమ్మం
     సర్వారం తండాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..!

    తండాల సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పరి తపించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఆదివాసీ గిరిజనుల తండాల సమగ్రఅభివృద్ధికి నిరంతరం ఆలోచన చేసి, అనేక సంక్షేమ కార్యక్రమాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పథకాల సృష్టికర్త కేసీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు నాయకులు. ఎస్టీల రిజర్వేషన్ 10 శాతానికి పెంచి 4 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సుజాతనగర్ మండలం, సర్వారం తండాలో గిరిజనులు బీఆర్‌ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.Legislative Branch
    కేసీఆర్‌కు క్షీరాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లావుడ్యా సత్యనారాయణ నాయక్ మాట్లాడుతూ.. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ 6 శాతం నుంచి 10 శాతానికి కేసీఆర్ పెంచారని వెల్లడించారు. 6 లక్షల మందికి పైగా పోడు పట్టాలు, 183 గిరిజన గురుకులాలు ఏర్పాటు,
    4,146 తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అదనంగా గిరిజన బిడ్డలకు సర్పంచ్, ఉప సర్పంచ్ పదవుల అవకాశం కల్పించారని కేసీఆర్‌ను ఆయన కొనియాడారు
    ట్రైకార్, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా సబ్సిడీ రుణాలు, గిరిజన విద్యార్ధుల విదేశీ విద్యకు రూ.20లక్షల ఆర్ధిక సహాయం, హైదరాబాద్ నడి బొడ్డున గిరిజనుల ఆత్మ గౌరవ ప్రతీకగా సేవాలాల్ మహారాజ్ పవన్, కొమరం భీమ్ భవన్ లు నిర్మించిన కేసీఆర్ గిరిజనుల ఆరాధ్య దైవంగా నిలిచారు ఆయన పేర్కొన్నారు. కానీ.. నేడు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో గిరిజనులను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ట్రైకార్, ST సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా ఎత్తి వేసిందని, గిరిజనులపై దాడులు జరిగితే పట్టించుకునే నాధుడే లేడు అని సత్యనారాయణ నాయక్ వాపోయారు.