Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మ‌గ శిశువులు జన్మిస్తే తల్లుల‌కు ఎందుకు క‌ష్టం ఎక్కువగా ఉంటుంది..

    Author VENKATESH | 22 Sep 2026, 09:37 PM | HEALTH
    మ‌గ శిశువులు జన్మిస్తే తల్లుల‌కు ఎందుకు క‌ష్టం ఎక్కువగా ఉంటుంది..

    ప్రసవం సమయంలో తల్లులు ఎదుర్కొనే నొప్పి, ఇబ్బందులకు ఇప్పటివరకు మానవ పరిణామ క్రమంలో జరిగిన శారీరక మార్పులనే ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే తాజా అధ్యయనం ప్రకారం.. పుట్టబోయే శిశువు లింగం కూడా ప్రసవం క్లిష్టతపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మగ శిశువులు ఆడ శిశువులతో పోలిస్తే పుట్టుక సమయంలో ఎక్కువ బరువుతో ఉండే అవకాశం ఉండడంతో, ప్రసవ సమయంలో తల్లికి అదనపు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. దీనిని కాస్ట్లీ సన్ హైపోథిసిస్ గా పేర్కొన్నారు. అమెరికన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన, ప్రసవం ఎందుకు క్లిష్టంగా ఉంటుందనే అంశంపై కొత్త కోణాన్ని ముందుకు తెచ్చింది.
    క్లిష్టంగా మారిన ప్ర‌స‌వం..
    మానవులు రెండు కాళ్లపై నడవడం ప్రారంభించిన పరిణామ క్రమంలో శ్రోణి భాగం నడకకు అనుకూలంగా కొంత సన్నగా మారింది. అదే సమయంలో మెదడు పరిమాణం పెరగడంతో శిశువుల తలలు కూడా పెద్దవయ్యాయి. ఫలితంగా పెద్ద తల ఉన్న శిశువు సన్నని జనన మార్గం గుండా బయటకు రావాల్సి రావడం ప్రసవాన్ని క్లిష్టంగా మార్చింది. ప్రసవ సమయంలో శిశువు ఒక నిర్దిష్టంగా తిరుగుతూ జనన మార్గం గుండా బయటకు రావాల్సి ఉంటుందని గత పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట ప్రసవాలు మనుషుల్లో మాత్రమే కాకుండా ఇతర క్షీరదాల్లోనూ కనిపిస్తున్నాయని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీంతో శిశువు లింగం కూడా ప్రసవ సమస్యల్లో పాత్ర పోషిస్తుందా అనే ప్రశ్నపై పరిశోధకులు దృష్టి సారించారు.
    క్షీర‌ద జాతుల్లోనూ..
    11 క్షీరద వర్గాలకు చెందిన 140 రకాల జంతువుల్లో పుట్టినప్పుడు మగ, ఆడ శిశువుల బరువులను పరిశోధకులు పరిశీలించారు. చాలా జాతుల్లో మగ పిల్లలు ఆడ పిల్లల కంటే ఎక్కువ బరువుతో జ‌న్మిస్తున్నట్లు గుర్తించారు. దీనివల్ల జనన మార్గం, శిశువు పరిమాణం మధ్య సరిపోకపోవడం, ప్రసవం ఎక్కువసేపు కొనసాగడం వంటి సమస్యల ముప్పు పెరుగుతుంద‌ని తెలిపారు. మనుషుల్లోనూ దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. నేపాల్‌లో మగ శిశువులకు జన్మనిచ్చే తల్లుల్లో ప్రసవం అడ్డంకులతో సాగించే అవకాశం 18 శాతం ఎక్కువగా ఉన్నట్లు గత పరిశోధనల్లో గుర్తించారు. భారత్‌లోనూ మగ శిశువులను మోసే గర్భాల్లో శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరిగే అవకాశం 3 శాతం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.