Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆర్చ‌రీ మిక్స్‌డ్ కాంపౌండ్‌ ఈవెంట్‌లో భార‌త్‌కు స్వ‌ర్ణం

    Author VENKATESH | 30 Sep 2026, 01:06 PM | Sports
     ఆర్చ‌రీ మిక్స్‌డ్ కాంపౌండ్‌ ఈవెంట్‌లో భార‌త్‌కు స్వ‌ర్ణం

    ఏషియ‌న్ గేమ్స్‌లో 11వ రోజు భార‌త్‌కు ఆర్చ‌రీలో రెండో స్వ‌ర్ణ ప‌త‌కం ల‌భించింది. మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఫైన‌ల్ ఈవెంట్‌లో భారత‌ బృందం గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్న‌ది. భార‌త మిక్స్‌డ్ జ‌ట్టులో చికితా తానిప‌ర్తి, సాహిల్ జాద‌వ్‌ ఉన్నారు. ఫైన‌ల్ గేమ్‌లో కొరియ‌న్ జంటపై స్వ‌ల్ప ఆధిక్యంలో భార‌త్ కొన‌సాగింది. తొలుత కొరియ‌న్ జంట ప‌ది పాయింట్లు సాధించి భార‌త్‌పై వ‌త్తిడి పెంచింది. అయితే చికితా, సాహిల్ 10 పాయింట్స్ కొట్టి.. ఒక్క పాయింట్ లీడ్‌లో కొన‌సాగారు. దీంతో మరోసారి కొరియ‌న్ల‌పై వ‌త్తిడి పెరిగింది. ఆ త‌ర్వాత కొరియా క్రీడాకారిణి పార్క్ 10, చోయి 10 పాయింట్లు సాధించారు. దీంతో గోల్డ్ మెడ‌ల్‌ను డిఫెండ్ చేసుకునేందుకు ఇండియా ప‌ర్ఫెక్ట్ 10 కొట్టాల్సి ఉంది.ఆ ద‌శ‌లో చికితా 9, సాహిల్ 10 పాయింట్లు చేశారు. దీంతో స్కోర్లు స‌మం అయ్యాయి. ఆ ద‌శ‌లో షూట్ ఆఫ్ నిర్వ‌హించారు. షూట్ ఆఫ్‌లో తొలుత చికితా 10 పాయింట్లు, ఆ త‌ర్వాత సాహిల్ 10 పాయింట్లు కొట్టి ప్ర‌త్య‌ర్థిపై వ‌త్తిడి పెంచారు. కొరియా ప్లేయ‌ర్ చోయి వ‌త్తిడిలో 9 పాయింట్స్ కొట్టాడు. దీంతో భార‌త మిక్స్‌డ్ బృందానికి స్వ‌ర్ణ ప‌త‌కం క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. గోల్డ్ మెడ‌ల్ సాధించిన భార‌త మిక్స్‌డ్ బృందం .. లాస్ ఏంజిల్స్‌లో జ‌రిగే 2028 ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించారు.