Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రామాయణంతో అనిల్ రావిపూడి కొత్త ప్రయోగం..

    Author VENKATESH | 02 Oct 2026, 11:32 AM | Cinema
     రామాయణంతో అనిల్ రావిపూడి కొత్త ప్రయోగం..

    దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. రామాయణం నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో ఓ భారీ యానిమేటెడ్ చిత్రం రూపొందనుందనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-విజువలైజేషన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, కథకు అనుగుణంగా భారీ స్థాయిలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్‌ను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. కామెడీ, భావోద్వేగాలు, కుటుంబ అంశాలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను తనదైన శైలిలో తెరకెక్కించడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. అలాంటి దర్శకుడు రామాయణం వంటి పౌరాణిక ఇతిహాసాన్ని యానిమేటెడ్ రూపంలో ఎలా ఆవిష్కరిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌లో రామాయణంలోని కీలక ఘట్టాలను ఆధునిక యానిమేషన్ సాంకేతికతతో భారీ స్థాయిలో చూపించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అయోధ్య, లంక, వానరసేన, రామసేతు, యుద్ధ సన్నివేశాలు వంటి కీలక ఘట్టాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సాధారణ యానిమేటెడ్ చిత్రాలకు భిన్నంగా అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్స్‌ను రూపొందించే దిశగా ప్రీ-విజువలైజేషన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివరాలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.ఈ భారీ ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గౌర హరి సంగీతం అందించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు, కథకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. యానిమేషన్ చిత్రంగా రూపొందితే ఈ సినిమాను కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.