Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఘనంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

    Author VENKATESH | 10 Jun 2026, 01:18 PM | TELANGANA
    ఘనంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

    బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదినాని బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ లోని ప్రభుత్వ దవాఖాన లో బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాల నాయకులు జాజుల జన్మదినాన్ని పురస్కరించుకొని సంక్షేమ సంఘం జిల్లా బాధ్యులు నాగుల కనకయ్య గౌడ్ కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు పేషెంట్ల అనుచరులకు అన్నప్రసాద వితరణ చేశారు , ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ తన పోరాటాలతో బీసీ విద్యార్థులకు బోధనా రుసుముతో పాటు సంక్షేమ వసతి గృహాల ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. అలాగే జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు.బీసీ వాదం తన ఊపిరిగా చేసుకున్న వ్యక్తి అని తెలిపారు. అందరి ఆదరాభిమానాలతో శ్రీనన్న గారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాచమల్ల రాజు , దొగ్గలి శ్రీధర్, మంతెన కిరణ్ , కాయితోజు బ్రహ్మచారి,విద్యార్థి సంఘం నేతలు నారోజు రాకేష్ చారి , యువజన సంఘం నేతలు మాదాసు సంజీవ్, మహిళా నాయకురాలు దేవరకొండ సంతోషి, గాజె ప్రజ్జోత్ , బోయిని ప్రశాంత్, కుటుంబ ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.